-
-
పెళ్ళికి ముందు ఒక్క!... క్షణం...!!
Pelliki Mundu Okka Kshanam
Author: Ranzith Kumar Nukathoti
Publisher: Durgabhavani Publications
Pages: 176Language: Telugu
ఈ కాలం యువతీయువకులు తమ కెరీర్‌పై చూపుతున్న శ్రద్ధ, ఆసక్తి తమ జీవితభాగస్వామి ఎన్నికలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీనికి కారణాలు అనేకం. ఈ పుస్తకం చదివితే వాటిని తెలుసుకోగల్గుతారు.
పెళ్ళి గురించిన అవగాహన, ఎంపికలో జాగ్రత్తలు, తల్లిదండ్రుల బాధ్యత, యవ్వనదశలో తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు అంశాలు.. చాలా చక్కగా పాఠకులకు అర్థమయ్యేలా వివరించడమైనది.
ప్రస్తుతం మనం ఎక్కడ విన్నా, విడాకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ అటు తల్లిదండ్రులకు, ఇటు భార్యాభర్తలకు అర్థంకాని ఆవేదనగా మారుతున్నాయి. వీటికి కారణం పెళ్ళికి ముందే అవగాహన (premarital counseling) లేకపోవడం. భాగస్వామి ఎన్నికలో అన్ని కోణాల నుండి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎలా? అన్న ప్రశ్నలకు సమాధానం ఈ పుస్తకంలో లభిస్తుంది.
పెళ్ళి తరువాత వచ్చే అదనపు బాధ్యతలను, సమస్యల గురించి, అత్తమామలు, ఆడపడుచులతో అడ్జస్ట్మెంట్స్, ఉద్యోగ బాధ్యతలు మొదలగు ఎదురయ్యే అనేక సమస్యల గురించి చాలా చక్కగా సలహాలు సూచనలు ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకుంటాం.
చివరగా పెళ్ళి బంధం నూరేళ్ళపాటు బలంగా ఉండడానికి కావలసిన అంశాలు, సుఖవంతమైన దాంపత్య జీవితానికి సూత్రాలు... మొదలగు అంశాలు చాలా విపులంగా వివరించారు రచయిత.
- డా॥ బి. చంద్రశేఖర్
