-
-
పెళ్ళాల పులి
Pellala Puli
Author: J.U.B.V. Prasad
Publisher: Navodaya Book House
Pages: 198Language: Telugu
ఈ సంకలనంలో కధలూ, వ్యాసాలూ కూడా ఉన్నప్పటికీ, కధల గురించి చెప్పేదేమీ లేదు. వ్యాసాల గురించే కొంచెం చెప్పాలి. ఈ వ్యాసాలన్నీ, ముఖ్యంగా, వేరు వేరు విషయాలు చదివినప్పుడు నాకు కలిగిన స్పందనలు. ఇవి కొన్ని విషయాలను తీసుకుని, వాటి మీద ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు కావు. వీటిలో కొన్ని, మామూలు పత్రికల్లో వచ్చినవీ; మిగిలినవి, వెబ్ పత్రికల్లో వచ్చినవీ.
వీటిలో మొదటి వ్యాసం, ''నన్ను మార్చిన పుస్తకం'' అనేది. నన్ను అది, ఎంత మార్చిందో అంత మార్చింది. దాన్ని మళ్ళీ చదివితే, మళ్ళీ ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూ వుంటుంది. ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియని విషయాన్నీ తెలిసినవి, '' కాపిటల్ పరిచయం'' చదివినప్పుడు. ఇది చదివాకే, విష వృక్షంలో పీఠిక బాగా అర్ధం అయింది. అనేక సంవత్సరాలు కష్టపడి చదివి, చిన్నదో పెద్దదో ఉద్యోగం సంపాదించి, యజమానికి సేవలు చేస్తున్న వాళ్ళందరూ చదవాల్సినవి ఇలాంటి పుస్తకాలే. ఈ పుస్తకాలు నా కళ్ళు తెరిపించాయి. ఈ పుస్తకంలో 68వ పేజీ వరకూ కధల భాగమూ, తర్వాత వ్యాసాల భాగమూ, ఉంటాయి.
- జె.యు.బి.వి. ప్రసాద్
