• Pebbili Hymavathi Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పెబ్బిలి హైమావతి కథలు

    Pebbili Hymavathi Kathalu

    Publisher: Pebbili Hymavathi

    Pages: 246
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన కళ్ల ముందున్న సాహితీ మహా సముద్రాన్ని చూస్తే, ఏమనిపిస్తుంది? ఏ ఒక్క రచయితో లేదా ఏ కొద్దిమంది రచయితలో - వారు ఎంత గొప్ప రచయితలైనా ఈ మహా సముద్రాన్ని సృష్టించలేరని అనుకోకుండా ఉండలేం. ఎందరెందరో రచయితలు -వేలాదిమంది రచయితలు- నిరంతరం సాహిత్యాన్ని చినుకుల్లా కురుస్తూ, వర్షంలా వర్షిస్తూ, పాయలుగా ప్రవహింపజేస్తూ ఉండడం వల్ల, పాయలన్నీ మహా ప్రవాహమై, సాహితీ మహా సముద్రం సృష్టించబడుతూ వస్తోంది. సాహిత్యం సమాజ సృష్టి, సాహిత్యం సమిష్టి సృష్టి - అన్న సామాజిక సాహిత్య ఆలోచనా విధానంలోంచే గొప్ప సాహిత్యం సృష్టించబడుతుంది. ఆ విధంగా చూస్తే, పెబ్బిలి హైమావతి కలం నుంచి కురిసిన కథానికా చినుకులు కూడా ఆ మహా సముద్రంలో కలిసి మిలమిలమెరుస్తూ ఎక్కడో అక్కడ దర్శనమిస్తాయని నమ్మకంగా చెప్పుకోగలం.

హైమావతి కథానికల్లో నిర్మాణశీలత `ఆశావహత` సహజత్వం` ప్రత్యేక లక్షణాలుగా ప్రవహిస్తాయి.

మానవుడు ఎన్ని తప్పులు చేస్తున్నా, వాటిని సరిదిద్దే వాడూ లేదా వాటిని నిర్మూలించి మంచిని నిలబెట్టే వాడూ, మంచిని పెంచేవాడూ, మానవుడే కాబట్టి మానవునిపట్ల అచంచల విశ్వాసం అనివార్యమౌతుంది. మానవుని పట్ల విశ్వాసం పోతే, అది సమస్త విధ్వంసాలకూ దారితీస్తుంది. దీన్ని ఆశావహ నిర్మాణశీలతత్త్వమంటారు. ఇటువంటి సంక్లిష్టమైన సామాజిక తత్త్వాన్ని, ఈ రచయిత్రి పాత్రల్లో `సంఘటనల్లో` పాత్రల సంభాషణల్లో `పాత్రల ఆలోచనా విధానంలో` సహజంగా, సరళంగా, కథాత్మకంగా, కళాత్మకంగా చిత్రించారు. అదంత తేలికైన పనికాదు. నిజానికి, హైమావతికి ఎలా సాధ్యమైందన్న ప్రశ్న రాక తప్పదు. జీవితంలో సాధారణంగా జరిగే సంఘటనలూ `సందర్భాలూ’ `విశేషాలూ` ఆమె ఇతివృత్తాలుగా తీసుకున్నారు. జీవితంలో తరచుగా కలుసుకుని మాట్లాడే మనుషుల్నే పాత్రలుగా చిత్రించారు. జీవితంలో తనకు అతి దగ్గరగా ‘తెలిసినతనం’ లోంచే అంతా చిత్రించారు. అందువల్లే అంత కష్టమైన పనిని, అంత తేలిగ్గా, అంత సహజంగా చేయగలిగారు. దీని వెనుక, ఆమె లోని నిర్మాణశీల దృక్పథం, ఆశావహ దృక్పథం, సజీవ శక్తిలా, సజీవ సత్యంలా పనిచేశాయని స్పష్టమౌతుంది. ఉన్న మానవ సంబంధాలను ఉన్నతీకరించుకోడానికి పనికొచ్చే భావజాలం అంతటా ప్రవహిస్తూ ప్రకాశిస్తూ కనబడుతుంది. సంభాషణల్లో కథనాన్ని నడిపే రచనా నైపుణ్యం వల్ల ఈ కథానికలు ఆసక్తిగా చదివిస్తాయి. మనం తరచుగా కలుసుకుంటున్న స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకుంటున్నంత సహజంగా సంభాషణలు సాగాయి.

నిర్మాణశీలతను ప్రాణవాయువుగా పీల్చుకుంటూ, ఆశావహ దృక్పథంతో పాఠకులు భవిష్యత్తులోకి చూసేలా చేయడంలోనే ఈ కథానికలు విశిష్ట కథానికలుగా నిలిచిపోతాయని ధైర్యంగా చెప్పుకోగలుగుతాం.

ఆ విధంగా, ఏ విధంగా చూసినా, పాఠకుల ఆదరణాభిమానాలు పొందుతాయని ఆశిద్దాం.

- జయంతి పాపారావు

Preview download free pdf of this Telugu book is available at Pebbili Hymavathi Kathalu