-
-
పయనం
Payanam
Author: Kesava.Dasu
Publisher: Self Published on Kinige
Pages: 63Language: Telugu
మన పురాణాలు, సాంప్రదాయాలు “కార్యేషుదాసి, కరణేషు మంత్రి, భోజ్యేషుమాత, శయనేషు రంభ అని స్త్రీ యొక్క గొప్పతనం గురించి, స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవితం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు అని వాళ్ళ ప్రాముఖ్యత గురించి, స్త్రీలను ఎలా గౌరవించాలో వాళ్ళకి ఎలా అండగా ఉండాలో అని యుగయుగాలుగా ప్రపంచానికి చెబితే.
ఇప్పుడు ఈ కలియుగంలో మాత్రం ఆ పురాణాలు చెప్పిన నీతి సూక్తులను మరచిపోయి స్త్రీలను బానిసలుగా, బలహీనురిగా పరిగణించి వాళ్ళమీద దాడులు చేస్తున్నారు. ప్రేమ పేరుతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ మనసులను, శరీరాలను బాధ పెడుతున్నారు. “దేవుడైనా పుట్టాలంటే స్త్రీ కడుపునుంచే” రావాలని తెలిసిన అది పవిత్రమైన చోటు అని తెలిసీ ఆ కడుపుమీదే తన్నుతున్నారు. ఆ పవిత్రమైన చోటునే గాయపరుస్తున్నారు. దేవుడు మగవాళ్ళని ఆడవాళ్ళ కంటే బలంగా పుట్టించింది వాళ్ళకి అండగా ఉంటారని గాని వాళ్ళని బలవంతం చేయడానికి కాదు. సమాజంలో తప్పులు ఒప్పులు రెండూ ఉంటాయి. అలా సమాజంలో తప్పు వల్ల స్త్రీ జీవితం ఎలా నాశనం అయిందో మళ్ళీ అదే సమాజంలోని మంచి వల్ల ఎలా బాగుపడిందో చెప్పడమే ఈ “పయనం” కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఈ కథ “పయనం” సమాజంలోని ఆడవాళ్ళని గౌరవించి వాళ్ళకి అండగా, ఆసరాగా ఉండే ప్రతి మనిషికి అంకితం.
- రచయిత
