• Patient Cheppe Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పేషెంట్ చెప్పే కథలు

    Patient Cheppe Kathalu

    Pages: 125
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

వివిధ సామాజిక స్థాయిలకు చెందిన రకరకాల రోగులు డా. విజయలక్ష్మి గారితో మనసు విప్పి చెప్పుకున్న బాధల్నీ, కష్టాల్నీ, చిన్న చిన్న కథలుగా రాసి, పాఠకులకు అందించమని ప్రముఖ పత్రికా సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు దాదాపు రెండు దశాబ్దాల క్రితం డా. విజయలక్ష్మిగారిని ప్రోత్సహించడం జరిగింది. ఫలితంగా ఆంధ్రజ్యోతి సచిత్రవార పత్రికలో ధారావాహింగా "పేషెంట్ చెప్పే కథలు" అచ్చయ్యాయి. వాటిని అదే పేరుతో1987లో సంకలనంగా వెలువరించారు. 2003లో మలి ముద్రణ జరిగింది. ఇప్పుడు ఈ-బుక్‌ రూపంలో!!

* * *

వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలు తమ దుఃఖాల్ని, కష్టాల్ని, అవమానాల్ని సమస్యల్ని బంధువులతోనూ, స్నేహితులతోనూ చెప్పుకోడానికి చిన్నతనంగా భావిస్తారు. తాము వారి దృష్టిలో చులకన అవుతామని, తమను వారు హేళనగా చూస్తారని భయపడతారు. తమ కోసం కొంత సమయం కేటాయించి, రవ్వంత సానుభూతిని చూపే డాక్టరు దొరికితే తమ శారీరక బాధల గురించి చెప్పడంతో పాటు మానసిక గాయాల గురించి కూడా చెప్పుకుంటారు. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందనో, మంత్రం వేసినట్లు తమ సమస్యలు మటుమాయమవుతాయనే ఆశతోనో డాక్టరుతో తమ సమస్యలని చెప్పుకునేవారు అరుదు. సహనంతో తాము చెప్పేది రాగద్వేషాల కతీతంగా వినడం, ఓదార్పునీ, ధైర్యాన్నీ ఇచ్చే మాటలు చెప్పి తమ మానసిక వేదనను తగ్గించడం, నీ పక్కన నేనున్నాననే భరోసా ఇవ్వడం - ఇవే వారు సామాన్యంగా కోరుకునేది.

అసలు తమ సమస్యను ఒకరికి మనసు విప్పి చెప్పుకోవడంలోనే ఆ సమస్య విడిపోయినట్లు, ఏదో ఒక మార్గం కనపడినట్లు అనిపిస్తుంది. తమ చదువు, విజ్ఞానం, లోకానుభవంతో తమ సమస్యను సజావుగా విశ్లేషించి పరిష్కారం సూచించగలరనే విశ్వాసం కూడా పేషెంట్స్ తమ కథల్ని డాక్టర్‌కి చెప్పడానికి పురికొల్పవచ్చు.

అందుకే మరో సారి ఈ కథలు - "పేషెంట్ చెప్పే కథలు".

- ఆలూరి విజయలక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at Patient Cheppe Kathalu