-
-
పతంజలి సాహిత్యం సంపుటం 2
Patanjali Sahityam Volume 2
Author: K.N.Y. Patanjali
Publisher: Manasu Foundation
Pages: 668Language: Telugu
పతంజలి సాహిత్యం రెండవ సంపుటం
మనసు ఫౌండేషన్ వారు వెలువరించిన "పతంజలి సాహిత్యం"లో రెండవ భాగం ఈ పుస్తకం. ఈ సంపుటంలో "పతంజలి కథలు", "పతంజలి భాష్యం", "సంపాదకీయాలు" "అవీ - ఇవీ", "గెలుపుసరే బతకడం ఎలా?" - ఉన్నాయి.
* * *
రచయిత గురించి
పతంజలిగా ప్రసిద్ధుడైన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి పుట్టడం, పెరగడం, చదవడం, పాత్రికేయ వృత్తిలో కాలూనడం ఉత్తరాంధ్రలోనే జరిగింది.
ప్రజాస్వామ్యానికి శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, పత్రికా వ్యవస్థలని మూల స్తంభాలుగా చెబుతారు. తెలుగు రచయితలు చాలా మంది వీటిల్లో డొల్లతనాన్ని, అన్యాయాన్ని ఎత్తి చూపడానికి ఒకటో రెండో రంగాలు ఎంచుకొని రాసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాని పతంజలి మాత్రం ఈ నాలుగు స్తంభాలనీ ఏకరీతిలో ఎండగట్టి, చీల్చి చెండాడేరు. ఇలా మూలవ్యవస్థలన్నింటిపై ప్రత్యేకంగా రచనలు సాగించి రాజ్యాన్ని ఎండగట్టిన, నిలదీసిన తెలుగు రచయిత బహుశా ఈయనొక్కరే కనబడతారు.
ఉత్తరాంధ్ర నుడికారంతో, చిక్కటి వ్యంగ్యంతో సాగే ఆయన రచనలు కాసేపు నవ్వు పుట్టిస్తాయి కాని నిక్కచ్చిగా, నిజాయితీగా, నిర్భీతిగా సాగే ఆ పదునైన వాక్యాలు పోనుపోను ఆలోచనలో పడేస్తాయి, ప్రశ్నిస్తాయి, నిలదీస్తాయి, సిగ్గుతో తలవంచుకునేలా చేస్తాయి, నిలువునా దహించుకుపోయేలా చేస్తాయి. అదే ఆయన రచనల్లో గొప్పదనం. అందుకే ఆయన తెలుగు సాహిత్య ప్రవాహంలో మిగతావారికన్నా విడిగా, ప్రత్యేకంగా నిలుస్తారు.
* * *
సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఫలితంగా ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత ప్రకటనే మరొక స్థాయిలో సామూహిక ప్రకటన అవుతుంది. సామూహిక క్రోధమే ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత క్రోధమవుతుంది. సామూహిక శోకం నా కంట్లో ఒక నీటి బొట్టవుతుంది.
- పతంజలి
