-
-
పాతాళానికి ప్రయాణం
Patalaniki Prayanam
Author: Dr. Srinivasa Chakravarthi
Publisher: Manchi Pustakam
Pages: 234Language: Telugu
ఒక రంగంలో లభ్యమై వున్న విజ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, దాని ఆధారంగా అద్భుతమైన సాహస గాథలు అల్లడంలో ప్రథముడు అని చెప్పుకోదగ్గ జూల్స్ వెర్న్, 1828లో ఫ్రాన్స్‌లో పుట్టాడు.
''ఆధునిక విజ్ఞానం ఇంత వరకు ప్రోదిచేసుకున్న భౌగోళిక, భూగర్భ, భౌతిక, ఖగోళ విజ్ఞానాన్ని అంతటినీ వినోదభరితంగా, ఆసక్తిదాయకంగా నవలా రూపంలో పొందుపరుస్తూ, ఆ విధంగా మొత్తం విశ్వ చరిత్రని పాఠకుడి ముందు ఉంచాలి'' అన్న లక్ష్యంతో రాయతలపెట్టిన ''అసామాన్య ప్రయాణాలు'' అనే కావ్యమాలిక ముందుగా "Journey to the center of the Earth"1863లో వెలువడింది. అన్వేషణా యాత్రలని, సాహస యాత్రలని ఒక విధంగా గొప్ప వైజ్ఞానిక ప్రయత్నాలుగా పరిగణించే కాలం అది. అయితే ఆ అన్వేషణా యాత్ర భూగర్భం లోతుల్లోకి చొచ్చుకుపోతూ, భూమి లోతులని శోధిస్తే ఎలా వుంటుంది అన్న అద్భుతమైన ప్రశ్నకి సమాధానంగా పుట్టిన కావ్యమే Journey to the Center of the Earth.
భూగర్భ శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ లీడెన్బ్రాక్కి అతి అల్లుడు ఏక్సెల్ పరిశోధనల్లో, అధ్యయనాలలో సహకరిస్తూ ఉంటాడు. భూగర్భంలోకి, భూమి కేంద్రం వరకు తీసుకు పోయే ఒక సహజ, రహస్య, సొరంగ మార్గం గురించి ఉన్న ఒక పురాతన రాతప్రతి ప్రొఫెసర్ లీడెన్బ్రాక్కి చేతికి చిక్కుతుంది. ఆ రాతప్రతి ఆధారంగా ప్రొఫెసరు, అతడి అల్లుడు ఒక అసామాన్య యాత్ర మీద బయలుదేరుతారు. ఐస్లాండ్లో ఒక నిష్క్రియమైన అగ్నిపర్వత ముఖం ఆ మార్గానికి ద్వారం. ఆ సొరంగ మార్గంలోకి ప్రవేశించి ఆ మామ, అల్లుళ్లు, వారికి తోడుగా వచ్చిన ఓ గైడ్ ఎదుర్కొన్న సవాళ్ల గాథే, చేసిన సాహసాల కథే "Journey to the Center of the Earth" లేదా ''పాతాళానికి ప్రయాణం.''
గమనిక: "పాతాళానికి ప్రయాణం" ఈబుక్ సైజు 14.5 mb
- ₹118.8
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60
waste of money and valuable time.
Brilliant Book !
Could not stop anywhere.
Thrilling.