• Pata Venuka Flash
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాట వెనుక ఫ్లాష్

    Pata Venuka Flash

    Pages: 126
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా జీవిత ప్రథమ భాగంలోని చిరుజ్ఞాపకాల సమాహారం ఈ "పాట వెనుక ఫ్లాష్". ఒక సందర్భంలో పాటలతో ఫ్లాష్‌బాక్‌లని అందంగా చెప్పవచ్చు అన్న యర్రంశెట్టి శాయిగారి మాటే ఈ సిరీస్‌ రాయడానికి స్ఫూర్తి. గతంలోకి తొంగిచూస్తూ కొన్ని విషయాల్ని చర్చించడానికి ప్రయత్నించాను. తల్లిదండ్రుల వెనుక జీవితం ఓ పాటలా సాగుతుంది. అందుకే కొన్ని పాటలు వినగానే గుర్తుకొచ్చే ఆనాటి కొన్ని సంఘటనల్ని ఆంధ్రప్రభ దినపత్రికలో వరుసగా రాశాను. మిత్రుడు విజయ్‌బాబు అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞుణ్ణి. అలాగే పాట వేయించి మరీ ఈ సిరీస్‌ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం చేయించిన ఆకాశవాణి సంచాలకులు మంగళగిరి ఆదిత్య ప్రసాద్‌గారికి కృతజ్ఞతలు. ఈ ప్రయోగంలో ఎంతవరకు విజయవంతమయ్యానో చదివి మీరే చెప్పాలి.

- వేదగిరి రాంబాబు

* * *

''నమో వెంకటేశా...'' అనే పాట వినగానే వేంకటేశ్వరుడి మీదకి కాకుండా, అమృతలూరులోకి పరిగెడుతుంది నా మనసు.

తురుమెళ్ళలో ఏడవ తరగతి చదివేప్పుడు అమృతలూరులో ఆమ్మదగ్గర ఉండి చదువుకునేవాణ్ణి. స్కూల్‌ నుంచి వచ్చి ఆమ్మ ఇంటి ఎదురుగా ఉన్న స్థలంలోనే నరసింహమూర్తి, మిగతా మిత్రులతో ఆడుకునేవాడిని.

సాయంత్రం ఎక్కువ సేపు ఉంటే బాగుండు. ఎక్కువ సేపు ఆడుకోవచ్చనే భావన. జీవితానికి ఆటవిడుపు వయసది. ఆనందంగా ఆడుకుంటున్నప్పుడు హఠాత్తుగా 'నమో వెంకటేశా...' అనే పాట వినిపించేసరికి గుండె గుభేల్‌మనేది. వాస్తవానికి సినిమా మొదటి ఆట ప్రారంభం అవుతోందని ఊరి జనానికి చెప్పడానికి అరగంట పైనే ఆంజనేయ స్వామి గుడి వెనుకున్న సినిమా హాల్లో పాటలు వేసేవాళ్ళు.

ఆ పాటల్లో కూడా ప్రతి రోజూ మొదటి పాట 'నమో వెంకటేశా...'

అది వినగానే గబగబా నీళ్ళు పెట్టమని చింతచెట్లకింద ఇంట్లో ఉంటున్న సాయిబు కేకపెట్టేవాడు. అతనికి స్నానం చేయాలనే అలారమ్‌నిచ్చేది ఆ పాట.

ఆ ఇంటిపక్కనే ఉన్న బందిలి దొడ్డి ఎదురుగా ఉన్న రావిచెట్టుకింద ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ పాటతో పాటు ఆ ప్రదేశం నా మదిలో మెదుల్తుంది.

సంధ్య చీకట్లు అలుముకుంటున్న వేళ... ఆ ప్రదేశమంతా తిరిగి చెట్లకి చేరుకుంటున్న పకక్షుల కిలకిలా రావాలతో నిండిపోయేది.

Preview download free pdf of this Telugu book is available at Pata Venuka Flash