-
-
పసిమొగ్గలు
Pasi Moggalu
Author: Yalamarti Anuradha
Publisher: Self Published on Kinige
Pages: 84Language: Telugu
మీ పిల్లలు మంచి వ్యక్తిత్వంతో పెరగాలంటే, మంచి చెడు బేధాలు తెలుసుకుని మర్యాద మన్ననలతో ప్రవర్తించాలంటే ఈ కథల పుస్తకం తప్పక చదవాల్సిందే !
***
యలమర్తి అనూ'రాధ' పిల్లల కోసం వెదజల్లిన కథా 'సుధ' పసి మొగ్గలు. బిఎస్సీ హోమ్ సైన్స్ చేసినా, ఆమె 'డ్రీమ్ సెన్స్' నలభై అయిదేళ్ళ సాహితీ వ్యవసాయం - రచనా వ్యాసంగం!
అనూరాధ 'అంబులపొది'లో సాహితీ సామాగ్రి సవాలక్ష. అందుకే వందలాది కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. ఒకే ఏడాదిలో అయిదు ప్రభుత్వ పురస్కారాలు, యాభైకి పైగా వివిధ సంస్థల అవార్డులు అందుకున్నారు. ఆంధ్రభూమిలో ఆమె వేసిన 'పచ్చబొట్టు' 'విలువల లోగిలిని' తెరిచింది. తానా సభలకు అమెరికాకు స్పెషల్ గెస్ట్‌గా పిలిచింది.
'పుస్తకాల రీడింగే' కాదు 'మస్తకాల రీడింగూ' అనూరాధకు ఇష్టం. అందుకే అన్నన్ని పత్రికలలో ఎన్నెన్నో శీర్షికలు నిర్వహించారు. 'ఈగ' వాలినా 'డేగ' వాలినట్లు హడావిడి చేసే ఈ రోజుల్లో - బోలెడు రచనలు చేసినా, అనూరాధ 'చిన్మయానందం'తో పాటు 'పెన్మ'యానందం పొందుతారు.
సామాజిక స్పృహ ఉన్న రచనలు చేయడం, వ్యక్తి సంస్కరణ, స్త్రీ చైతన్యానికి కృషిచేయడం ఆమె లక్ష్యం. ఆ దిశగా నడిచే అనూరాధ రచనలకు 'ఫోర్సెక్కువ' - ఆమె సృజనకు 'పదునెక్కువ!'
అనూరాధ తన 'మైండ్'లోని ఊహలకు 'సౌండ్' కల్పించి, అనేక కవితా సమ్మేళనాల్లో పాల్గొన్నారు. లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రికార్డులు సాధించారు. ఇంత చేసినా ఆమె 'లుక్స్' అన్నీ పిల్లల ‘బుక్స్' మీదనే ఉంటాయి. అందుకే 'పసి మొగ్గలు' బాలల కథా సంపుటి సృజన!
తనకిష్టమైన 'గోరు ముద్దలు' తినిపించటంకన్నా, ఎదుటివారు 'కోరు ముద్దలు' తినిపిస్తే ఫలితం బాగుంటుందని భావించి అంతగా జానపద కథల జోలికి పోకుండా సాంఘిక కథల సౌరభాన్ని ఆబాలగోపాలం ఆస్వాదించేలా పసి మొగ్గల ద్వారా అందించారు అనూరాధ.
అనూరాధ తన 'మానస' సరోవరంలో అన్వేషించి వెలికి తీసిన ముత్యాలు ఈ 'పసి మొగ్గలు'లోని 30 బాలల కథలు. చదివితే ఆ కథల ప్రాముఖ్యం మీరే తెలుసుకుంటారుగా! చదవబోతూ కథల వివరాలెందుకు? పదండి ముందుకు!!
- చొక్కాపు వెంకట రమణ
