-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
పార్వతీపరమేశ్వర కళ్యాణము (free)
Parvatee Parameswara Kalyanamu - free
Author: Rajan PTSK
Publisher: Self Published on Kinige
Pages: 39Language: Telugu
పార్వతీదేవి గాంచిన శివ స్వరూపము:
ఓంకారనాదమే ఒడలుగా మారగా
వేదములు విభూతి విభవమవగ
పంచభూతములయ్యె పంచేంద్రియములుగా
శశిరేఖనమరెను శిఖను మణిగ
బడబాగ్ని దావాగ్ని ఫాలనేత్రము కాగ
నాగములన్నియూ నగలుకాగ
ధవళనగము నందు దరహాస వదనుడై
సర్వేశుడుండెను శాంతుడిగను
కామధేనువు నచట చక్కంగనుండె
కల్పవృక్షము తారల కాపుకాసె
వేల్పుగానము వీనుల విందుజేయ
వేడుకగ శివనగము శోభిల్లు చుండె
***
పెండ్లి వేడుక:
వింధ్య మేరువులాయె పెండ్లిపీటలుగా
ధవళ మేఘపు వితతి పందిరాయె
తెలిమంచు తెల్లనీ తెరగమార నదులు
పన్నీరు జల్లెడి పడుచులాయె
ఉదయభానుడమరె ఉమ నుదుట తిలకమై
సోముడు కపర్థి మకుటమాయె
మునిగె తారలు పసుపు జలమునందు
నిగమచరు కరమునక్షతలు కాగ
సరసిజములతిథులకు ఆసనములాయె
హంసగణములు పెండ్లి వాహనములాయె
సకల దివిజులమరె పరిచారకులుగ
విశ్వబాంధవుల వివాహ వేడుకందు
***
హాయి గొలుపగ నీదు కళ్యాణ కథను
వ్రాసితిని కవనముగ నేపరవశమున
వ్యాకరణమందునా పసివాడనోయి
తీరికగ దోషములు సరిదిద్ద వోయి
- త్రిసత్య కామరాజన్
Thank you sir, You're earlier poetry book 'Na Gola' also I loved it.