-
-
పర్వతాలు చెప్పిన ఆధునిక జానపద కథలు
Parvatalu Cheppina Adhunika Janapada Kathalu
Author: Tummeti Raghottama Reddy
Pages: 52Language: Telugu
ఈ కథల్ని 1985-86 మధ్య రాసాను. బి. విజయకుమార్ సంపాదకత్వాన కరీంనగర్ నుంచి వెలువడ్డ 'జీవగడ్డ' దినపత్రికలో ప్రచురించబడ్డాయి. ఈ కథల్ని ఈ విధంగా చెప్పవలసి రావటానికి కారణం, అప్పుడు తెలంగాణ అంతటా 'చీకటి రోజులు'. ప్రజాఉద్యమాన్ని అణచివేసే నెపం మీద పోలీసుల దమనకాండ సాగేది. దాంతో మాకు ఉన్న ప్రచురణ అవకాశాలు మూసుకుపోయాయి. 'చీకటి రోజుల్లో కూడ చీకటిపాటలుంటాయి' అనే జర్మన్ నాటక రచయిత బ్రెహ్ట్ మాటల్ని మా చిరకాల మిత్రుడు డా. కండెపనేని సత్యవరప్రసాద్ గారు మాటల సందర్భంలో ఆ రోజుల్లోనే నాతో అన్నారు. బ్రెహ్ట్ రాసిన నాటకం 'మదర్ కరేజి' తెలుగు అనువాదాన్ని చదవమని నాకిచ్చారు. ఆ పరిస్థితుల్లో ఆ నాటకం చదవడం నాకు ప్రేరణ కలిగించింది. అప్పుడున్న పరిస్థితుల్ని అధిగమించడానికి నాకో మార్గం దొరికినట్టు అనిపించింది.
ఈ కథలన్నింటినీ 1985కు పూర్వమే, నా చిన్నతనం నుంచి మా గ్రామంలో నేను విన్న పంబాల కథకుల 'ఈదామ్మ కొలుపు' కథలోనో, బుర్ర కథలు వంటి ఇతర కథా గానాల్లోనో మధ్య మధ్య పిట్ట కథలుగా చెప్పగా విన్నవి. ఐతే ఆ కథలన్నీ అశాస్త్రీయ దృక్పథంతో నిండి ఉండేవి. నాకా కథలన్నీ తలకిందులుగా కనిపించేవి. అన్ని సంవత్సరాల తర్వాత ఆ కథల్ని నాదైన దృక్పథంతో తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఈ కథల్ని వాటి కాళ్ళ మీద వాటిని నిలబెట్టడం వంటిదే నేను చేసిన పని.
- తుమ్మేటి రఘోత్తమరెడ్డి

- ₹60
- ₹162
- ₹432
- ₹324
- ₹108
- ₹108