-
-
పరీక్షల్లో విజయం సాధించాలంటే...
Parikshallo Vijayam Sadhinchalante
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 31Language: Telugu
ఎగ్జామ్స్ స్పెషల్
పరీక్షలు అంటే భయం...ఎందుకంటే...
పరీక్షలు అనగానే రాత్రుళ్ళు మేలుకుని ఉండడం...తెల్లవార్లూ చదువుతూ ఉండడం
అర్థరాత్రుళ్లు పరీక్షాపత్రం ఎపుడు లీక్ అవుతుందా అని ఎదురుచూడడం ?
పొద్దున్నే టెన్షన్స్ తో పరీక్షలకు బయల్దేరడం
పాఠాలన్నీ బట్టీ పట్టడం
దేవుడిగుళ్ళకు వెళ్లి మొక్కుకోవడం
పిల్లలతోపాటు తల్లిదండ్రులూ యుద్ధానికి వెళ్తున్నట్టు భయపడడం...
అసలు పరీక్షలు అంటే భయమెందుకు?
భయంతోనే ఓటమి మొదలవుతుంది
భయాన్ని వదిలేస్తే పరీక్షల్లో గెలుపు మీ స్వంతం అవుతుంది.
పరీక్షలు అంటే మీరు చదివినవి..మీరు నేర్చుకున్నవి మీకు గుర్తున్నాయా? లేదా? అని తెలుసుకోవడం
మిమల్ని మరో మెట్టు(పై తరగతికి)పై మిమ్మల్ని నిలబెట్టడం..
ప్రతీ పరీక్ష ఒక మెట్టు..ఆలా మెట్లు ఎక్కితే ఉన్నతస్థానమునే సింహాసనం మీద మీరు కూర్చోగలుగుతారు.
మరి పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రతీ పాఠాన్ని ఒక కథలా చదవాలి.
* మోదీ ‘ఎగ్జామ్ వారియర్స్’
*తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకునేదెలా?
* ఒక పిల్లవాడి ప్రశ్న
* భయపడితే ఏమీ సాధించలేము.
* మీరే మార్కులు వేయండి
* వీటిని వదిలేయండి
ఇంకా బోలెడు విషయాలు
ప్రముఖ రచయిత విజయార్కె
‘పరీక్షల్లో విజయం సాధించాలంటే’
మేన్ రోబో పబ్లికేషన్స్ సగర్వ సమర్పణ
ఇది పరీక్షా సమయం.పరీక్షలంటే పిల్లలకు భయం పెద్దలకు ఆందోళన.ఇలాంటి సమయంలో ఈ పుస్తకం కొంతవరకైనా మీకు ఒక గైడ్ లా ఉపయోగపడుతుంది.
ఈ పుస్తకంలో చెప్పినట్టు ..
" భయంతోనే ఓటమి మొదలవుతుంది
భయాన్ని వదిలేస్తే పరీక్షల్లో గెలుపు మీ స్వంతం అవుతుంది."
" ప్రతీ పాఠాన్ని ఒక కథలా చదవాలి." అన్నది అక్షరసత్యం
పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం.