-
-
పరావర్తనం
Paravartanam
Author: Rapolu Seeta Rama Raju
Publisher: Palapitta Books
Pages: 160Language: Telugu
రాపోలు సీతారామరాజు విమర్శనా వ్యాసంగం పాఠకులకు దారిదీపం. సాహిత్య చరిత్ర రచనకు దోహదకారి. కొత్త కవులకు ఉద్దీపన. ఓ పుస్తకాన్ని చదివి పరవశానికి లోనయ్యే పాఠకులకు కొత్తచూపును అందించే పనిముట్టు. ఒక రచన చదివి గొప్పగా ఉందని పాఠకులు అలవికాని ఆనందానికీ, పారవశ్యానికీ లోనవుతారు. తమను అంత విభ్రమకు లోనుచేసే ఇంద్రజాలం ఏముందో విమర్శకులు చెప్పినప్పుడు పాఠక హృదయం మరింత ఉల్లాసభరితమవుతుంది. ఈ విధంగా పఠనానుభవాన్ని ఉద్దీపింపజేసే లక్షణం సీతారామరాజు విమర్శలో దాగుంది.
- గుడిపాటి
రాపోలు సీతారామరాజు సాహిత్య వ్యాసాల పుస్తకం 'పరావర్తనం' సాహిత్యాన్ని తనదైన దృష్టితో చదివి, అనుభవించి ఆ అనుభవం చెప్పిన గమనింపులను ఊతంగా చేసుకుని సాహిత్యపాఠాన్ని వ్యాఖ్యానించిన వ్యాసాలు. ఇష్టమైన వస్తువులున్న కవితలను చూసి వాటికుండే నైతిక సమర్థనలో మునిగిపోయి కవిత్వాన్ని పైకెత్తే వ్యామోహాన్ని ఈ వ్యాసాలు చాలావరకు వదులుకున్నాయి. ఇలాంటి వాటినే కాకుండా కవిత్వాన్ని తానుగా స్వయంగా చదవడం వల్ల వస్తుగతమైన పూర్వపు మూసలనుంచి బయటపడ్డారు.
- ఎం. నారాయణశర్మ
