-
-
పరంపర, ఎటు.?
Parampara Yetu
Author: Raamaa Chandramouli
Publisher: Srujana Lokam
Pages: 144Language: Telugu
శ్రీ రామా చంద్రమౌళి రచించిన రెండు నవలికల సంకలనం ఈ పుస్తకం.
"పరంపర" చిత్ర మాసపత్రిక మార్చి 2013 సంచికలో అనుబంధ నవలికగా ప్రచురితం.
"ఎటు.?" చిత్ర మాసపత్రికలో 2014 జూన్ నుంచి నవంబర్ దాకా ధారావాహికంగా ప్రచురితం.
* * *
"మెట్టు.. మెట్లు.. పైకి ఆకాశంలోకి మెట్లు. .లోపలికి దిగుడుబావిలోకి కూడా మెట్లే. అందరూ అనుకునేట్టుగా మెట్లు కేవలం ఎక్కటానికే కాదు అంతకుమించి దిగేందుకు అత్యావశ్యకమని తెలుసుకోవడం.. మొట్టమొదట ఈ రహస్యం చెప్పినవాడు తాతయ్యే. 'మెట్లు ఎక్కి ఎక్కి.. ఏ ఎత్తుల్లోనైనా ఎంతకాలం ఉంటాం చైతూ.. ఎప్పుడో ఒకప్పుడు తప్పని సరిగా, ఎవరైనా కిందికి, నేలమీదికి దిగిరావలసిందే.. పాదాలెప్పుడూ నేలస్పర్శతోనే పులకించిపోతాయి తప్ప బంగారు ఫ్లోరింగ్లపై కాదు. విత్తనం మొలకెత్తి జీవం పోసుకోడానికి మట్టి కావాలిగాని బంగారం కాదు..' అని చెప్పేవాడు తాతయ్య."
- (పరంపర నవలిక నుంచి)
* * *
"మనిషి ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తున్నకొద్దీ... దృష్టి విశాలమై, విస్తృతి పెరిగి పెరిగి లోకం విపులంగా... విశాలంగా... స్పష్టంగా, కనబడ్తూ అర్థమౌతూ... తెలుసుకోడం మొదలై... కొన్ని సందర్భాలలో కొందరు చెప్పిన మంచి మాటలు మన జీవితాల్లో శాశ్వతమై నిరంతరం వాళ్ళ మదిలో నిలిచిపోయి అజ్ఞాతంగా నడిపిస్తునే ఉంటాయి."
- (ఎటు.? నవలిక నుంచి)
