• Paramageetham Sriram
 • Ebook Hide Help
  ₹ 270
  300
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పరమగీతం - శ్రీరామ్

  Paramageetham Sriram

  Author:

  Pages: 85
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 4 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

‘పరమగీతం’ పుస్తకం తెలుగులో మొట్టమొదటి Complete Digital Art Iillustrated Poetry Book. ఈ పుస్తకంలోని ప్రతి కవితకి పూర్తిగా సంతృప్తి కలిగేలా Digital Art రూపొందించడానికి నాకు పది ఏళ్ళు పట్టింది.

***

‘పరమగీతం’ మార్మిక కవిత్వం లేదా ధ్యాన కవిత్వం కోవకి చెందుతుందని చెప్పవచ్చు. సాధారణ కవిత్వాన్ని మాత్రమే ఇష్టపడేవారికి ఇది అనాసక్తంగా అనిపించవచ్చు, అర్థం కాకపోవచ్చు, లేదా access కాకపోవచ్చు. జెన్, సూఫీ వంటి తాత్విక కవితారీతుల్ని; జిబ్రాన్, టాగోర్ ల మార్మిక కవిత్వాన్ని ఇష్టపడేవారు, జీవితపరమార్థాన్ని తెలుసుకోవాలని నిబద్ధతతో పరితపించేవారు ఈ పుస్తకాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. జీవితంపట్ల, సత్యం పట్ల ప్రేమ గలవారికి ఈ పుస్తకం సాంద్రమైన, లోతయిన, ఉత్కృష్టమైన తాత్వికానుభవాన్నిస్తుందని బలంగా చెప్పగలను.

***


"జన్మానికి మృత్యువుకి అట్టే తేడా లేదు
నీ జ్ఞానంలో మార్పేలేదు
కొత్తగా నేర్చుకొనేదేమీ లేదు..."
ఈ పుస్తకం conclusion కాదు. కదలిక. క్రూరమైన నిజాయితీతో కూడిన అంతర్వీక్షణ. జీవితాన్ని ప్రశ్నించడం అదే సమయంలో ప్రశ్నలేకుండా జీవితాన్ని చూడడం, చూస్తూ ఆ గతిలో ప్రవహించడం. సత్యం తనంతట తాను గతిశీలమైనప్పుడు; నిర్దేశిత, నిర్దిష్ట సత్యమనేది మనుగడలో లేనప్పుడూ, ఉండడం సాధ్యం కానప్పుడూ; ఒక స్థిరమైన, ఖచ్చితమైన విలువల్ని ప్రతిపాదించేదిగానో లేదా నిర్వచించేదిగానో, ఒక conclusion గానో కవిత్వం ఉండడం అసహజమనిపిస్తుంది నాకు.

కదలికని ఒడిసిపట్టడమే కవిత్వం, జీవన గమనాన్ని అదే వడిలో ఆవిష్కరించడమే కవిత్వం. దాని accuracy తోనూ, ఫలితంతోనూ మనకి సంబంధం లేదు. అందువల్ల నా కవిత్వంలో ఒక dynamic quality ఉంటుంది. అది ఒక conclusion గా కాక కదలికగా ఉంటుంది. అదీ ఎంతో గాఢంగా, ఒక firsthand experience లాగా; మొదటి ముద్దులాగానో లేదా వేలు తెగి దేహం నుండి విడివడినప్పుడు కలిగే నొప్పిలాగానో; impulsive గా, spontaneous గా, ఒక పిడుగులాగా చదివినవారి చేతనని ఆసాంతం ఆక్రమించి వారి ఆస్తిత్వాన్ని తల్లక్రిందులు చెయ్యాలి. జీవితపు ప్రశ్నలు వేనకువేలు శరాఘాతాలై వారి హృదయాల్ని గాయపరచాలి. ఆ గాయం నుండి స్రవించే చిక్కటి తాత్వీకృతమైన కవితానుభవానికి వారు వణికిపోవాలి. జీవితపు కదలికని ఎటువంటి తెరలు లేకుండా సూటిగా వారు దర్శించాలి. ఆ కదలిక వారి వ్యక్తిత్వాన్ని, విశ్వాసాల్ని, ప్రోదిచేసుకున్న సర్వాన్ని ఉప్పెనలా ఊడ్చి తీసుకుపోవాలి. పాఠకులని ఒక నిస్సహాయమైన స్థితిలో విడిచిపెట్టడమే ఈ కవిత్వం చేసే పని (అందుకు ఈ కవిని నిందించి ప్రయోజనం లేదు).

మనసు సృష్టించిన సుఖవంతమైన మిధ్యాభ్రాంతుల తెరలు తొలగిన వేళ ఒక నగ్న స్థితిలో నిస్సహాయంగా నిలచిన మనిషికి సత్యాన్ని దర్శించడానికి ఆటంకాన్ని కలిగించేదేముంటుంది? ఆ స్థితిలో కొంతసేపయినా నిలువగలిగే శక్తిని పాఠకునికి ఇవ్వగలిగితే ఈ పుస్తకం యొక్క ప్రయోజనం సిద్ధించినట్టే. ఆ ప్రగాఢమైన తాత్వికానుభవంలో కొంతసేపయినా మనిషి మునకవేస్తే, అతనిలో ఒక ఎరుక స్థితి ఏర్పడితే, అతడు విప్పార్చిన కళ్ళతో నిజమైన జీవితాన్ని దాని సహజ స్థితిలో చూడగలిగితే ఆ జ్ఞానం అతనిలో నిలిచిపోతుందని భావిస్తాను.

***

ఈ పుస్తకంలోని కవితా వాక్యాలను చదివినప్పుడు పాఠకుని మనోఫలకం మీద ఏర్పడే దృశ్యాన్ని ఈ డిజిటల్ ఆర్ట్ వర్ణచిత్రాలు ప్రభావితం చేస్తాయి. ఈ కవితలు వాటిలో అమరివున్న పదాల అభివ్యక్తికి మించి మరింత విస్తృతిని సాధించడానికి డిజిటల్ ఆర్ట్ ప్రక్రియని నేను ఉపయోగించుకున్నాను. ఈ పదాలు, చిత్రాలు ఏకీకృతమై ఒక గొప్ప artistic energyగా పాఠకుని మనసు లోలోపలి పొరల్లోకి ఇంకిపోవాలని కోరుకుంటున్నాను. దృశ్యానికి ఉన్న శక్తి అనుపమానమైనది. ఒక గొప్ప painting ని అనుభూతి చెందడానికి నెలల తరబడి museum లో ఎందుకు గడుపుతారు? మనసు నిశ్శబ్దమయ్యేకొద్దీ అనుభూతి యొక్క విస్తృతి, గాఢత ద్విగుణీకృతమవుతాయి. దృశ్యాలు మనం మార్మిక తీరాలకు చేసే ప్రయాణాన్ని సునాయాసం చేస్తాయి.

కవితను, చిత్రాన్ని విడివిడిగా చూడకుండా వాటికి నడుమనున్న integrity ని అనుభూతి చెందేలా చేయడం ద్వారా పాఠకుని అనుభవాన్ని మరింత enrich చెయ్యడం, అతనిని మరింత అంతర్ముఖుని చేయడం నా ఉద్దేశ్యం. ఈ ప్రతి దృశ్యమూ పాఠకుని దృశ్యరహిత స్థితికి తీసుకెళ్ళడం కోసమే. చిత్రమైన వెలుగునీడల సామరస్యంతో ఏర్పడిన భగవంతుని సృష్టి ఈ కళాకారుని (కవి) హృదయపటలం మీద ప్రతిఫలించినప్పుడు ఇలా ఇన్ని అసంఖ్యాక వర్ణాలుగా విరజిమ్మబడుతోంది. అన్ని వర్ణాలూ లోపలి కాంతిని ఆకర్షింపజేయడానికే కదా సృష్టింపబడ్డాయి అనుకుంటాను.

- శ్రీరామ్

గమనిక: "పరమగీతం - శ్రీరామ్" ఈబుక్ సైజు 29.4mb
Preview download free pdf of this Telugu book is available at Paramageetham Sriram
Comment(s) ...

మనకి ఏదైనా ఒక గొప్ప విషయం ఒకో అప్పుడు సరిగా అవగతం కాకపోవచ్చు..... మృదువైన మాటల్లో చాలా కఠినమైన సత్యం దాగి ఉండొచ్చు... గడ్డిపోచ నుండి రాలే చివరి మంచు బిందువు మన హృదయం లో దాచబడిన బడా బాగ్ని ని మేలుకొల్పచ్చు .....సీతాకోకచిలుక రెక్క సైతం మన జ్ఞాపకాల దొంతరలను కదిలించవచ్చు ....మనం మరచిపోయామని అనుకున్న స్పందనలను, సాదారణంగా అనిపించే లేదా కనిపించే ఏ విషయాలన్నా తట్టిలేపచ్చు ..సరిగ్గా అదే జరిగింది ...ఈ పరమగీతం పుస్తకం విషయం లో ......
ఒక గొప్ప అనుభవం, అత్యంత పొందికైన ఈ మాటల్లో పొదిగి ఉంది.....ఈ పుస్తకం లో పుటలలోని పాటలు మన ఆత్మని ఒక ప్రత్యేకమైన స్థానము లో ఉంచి తియ్యని సుగందాల్ని వెదజల్లుతుంది...వెనువెంటనే , మనం ఆ పారవశ్యం లోనుండి వెలుపలికి రానియ్యకుండా దుఃఖపు చీకట్లో లోకి తొస్తుంది... మన భయాలు ,మన వేదనలు , మన ప్రశ్నలు అన్నిటికి సమాధానాలు వెతకాలనే కాంక్షను రగిలిస్తుంది.....
మనకి ఏదైనా ఒక గొప్ప విషయం ఒకో అప్పుడు సరిగా అవగతం కాకపోవచ్చు..... మృదువైన మాటల్లో చాలా కఠినమైన సత్యం దాగి ఉండొచ్చు... గడ్డిపోచ నుండి రాలే చివరి మంచు బిందువు మన హృదయం లో దాచబడిన బడా బాగ్ని ని మేలుకొల్పచ్చు .....సీతాకోకచిలుక రెక్క సైతం మన జ్ఞాపకాల దొంతరలను కదిలించవచ్చు ....మనం మరచిపోయామని అనుకున్న స్పందనలను, సాదారణంగా అనిపించే లేదా కనిపించే ఏ విషయాలన్నా తట్టిలేపచ్చు ..సరిగ్గా అదే జరిగింది ...ఈ పరమగీతం పుస్తకం విషయం లో ......
ఒక గొప్ప అనుభవం, అత్యంత పొందికైన ఈ మాటల్లో పొదిగి ఉంది.....ఈ పుస్తకం లో పుటలలోని పాటలు మన ఆత్మని ఒక ప్రత్యేకమైన స్థానము లో ఉంచి తియ్యని సుగందాల్ని వెదజల్లుతుంది...వెనువెంటనే , మనం ఆ పారవశ్యం లోనుండి వెలుపలికి రానియ్యకుండా దుఃఖపు చీకట్లో లోకి తొస్తుంది... మన భయాలు ,మన వేదనలు , మన ప్రశ్నలు అన్నిటికి సమాధానాలు వెతకాలనే కాంక్షను రగిలిస్తుంది...


అత్యంత సున్నితమైన కవిత్వంలో గంభీరమైన తాత్వికతని, వర్ణ చిత్రాలలో లోతైన భావోద్వేగాలని సహజంగా, మృదువుగా పొదిగిన ఈ పుస్తకానికి ‘వేదాంత భేరి’ అని పేరు పెడితే బాగుండేదేమో అనిపించింది నాకు. ఎవరూ మిస్ అవ్వకూడని పుస్తకం. జ్ఞాన నిధి అని చెప్పవచ్చు.

ఏ వందేళ్ళకో ఒకసారి మాత్రమే కనిపించే అరుదైన, ప్రకాశవంతమైన తోకచుక్కలా ఈ అపురూపమైన పుస్తకం మహోన్నత లక్షణాలతో తెలుగు సాహిత్యానికే తలమానికంగా నిలుస్తుంది. అష్టావక్రగీతలా, టాగోర్ గీతాంజలిలా, జిబ్రాన్ ప్రోఫెట్ లా ఆచంద్రతారార్కం నిలిచిపోయే గొప్ప లక్షణాలు ఉన్న ఉన్నత స్థాయి మార్మిక కవిత్వమిది. తెలుగు సాహిత్యం ప్రపంచానికిచ్చే గొప్ప మాస్టర్ పీస్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పుస్తకం చదివినవారు ఎంతో తీవ్రంగా ప్రభావితమవుతారు. ఇటువంటి కవిత్వాన్ని ఒకరు ప్రయత్నంతో రాయలేరు. ఒక కాలానికి సంబంధించిన, ఒక ప్రాంతానికి సంబంధించిన విషయాలను కాక శాశ్వత సత్యాన్ని వ్యక్తీకరించే ఈ పుస్తకం వేయి సంవత్సరాల తరువాత కూడా మనిషిని ఇంతే గాఢతతో ప్రభావితం చేస్తుంది. ఈ రోజు కాకపోయినా రాబోయే రోజులలోనయినా ఈ పుస్తకం గొప్ప గౌరవాన్ని పొందుతుంది. ఎందుకంటే ఈ పుస్తకం వ్యక్తం చేసే శ్రేష్టమైన తాత్వికత, ప్రగాఢమైన అభివ్యక్తి విలక్షణమైనవి. మహామహులైన ప్రపంచ మార్మిక కవుల అత్యుత్తమ కావ్యాల సరసన చేర్చదగ్గ ఈ పుస్తకం మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చెయ్యడమే కాకుండా, మన చేతనలో ఒక బలమైన కదలికని తీసుకువస్తుంది. పదే పదే చదివేకొద్దీ తాత్విక జీవధార మనల్ని అనూహ్యమైన, ఉత్కృష్టమైన తలాలలోకి తీసుకువెళ్ళి; మన జీవితాన్ని, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం మనం పడిన, పడుతున్న సంఘర్షణని, తపనని, ఆర్తిని కొత్త వెలుగుతో చూపుతుంది. నిత్యపారాయణ గ్రంథంలా ఉంచుకోదగ్గ, శ్రద్ధతో చదవదగ్గ ఈ పుస్తకం, చదివిన ప్రతిసారీ క్రొత్త సత్యాన్ని మన హృదయానికి తీవ్రమైన తీక్షణతతో అవగతమయ్యేలా చేస్తుంది.
ప్రపంచ శ్రేణి మార్మిక కవిత్వం, అత్యుత్తమ వర్ణ చిత్రాలలో కూడిన ఈ రంగుల పుస్తకం తెలుగు కవిత్వంలోనే ఒక గొప్ప ప్రయోగం. ఇటువంటి గొప్ప పుస్తకానికి తగిన గౌరవం ఇచ్చి ప్రాచుర్యం కల్పించడం, కాపాడుకోవడం ప్రతి నిజాయితీపరుడయిన సాహిత్యకారుని బాధ్యతగా భావిస్తున్నాను. నా వంతు ఈ కొన్ని మాటలతో ప్రారంభిస్తున్నాను.