-
-
పరమగీతం
Paramageetham
Author: Deevi Subbarao
Pages: 80Language: Telugu
బైబిల్ రెండు భాగాలు. ఒకటి పాత నిబంధన, ఇంకోటి కొత్త నిబంధన. పాత నిబంధనలోని అతి చిన్న పుస్తకాల్లో 'సాంగ్ ఆఫ్ సొలొమోన్' లేక 'సాంగ్ ఆఫ్ సాంగ్స్' ఒకటి. తెలుగులో పరమగీతం. ఎనిమిదే అధ్యాయాలు. పరిశోధకులు తేల్చి చెప్పకపోయినా దీన్ని సొలొమోన్ రాశాడనే జనవాక్యం.
సొలొమోన్ చేత రచింపబడ్డ అన్ని గీతాల్లోకి ఇది ఉత్తమోత్తమమైనది కావటాన ఇది సాంగ్ ఆఫ్ సాంగ్స్. గీతాల్లో పరమ ఉత్కృష్టమైన గీతం. పరమ గీతం.
పవిత్ర గ్రంథమైన బైబిల్లో దేవుడు అనే మాట ఒక్కచోట గూడా లేని భాగం ఈ పరమగీతం. బాహ్యార్థంలో ఇది ప్రేయసీ ప్రియుల ప్రేమను వర్ణించే ఉదాత్త ప్రేమ కావ్యంగా కన్పట్టినప్పటికీ, భగవంతునికి - యూదు ప్రజకు, క్రీస్తుకు-చర్చికి మధ్యగల ప్రేమాను బంధాన్ని నిరూపించేదిగా కూడా పండితులు దీని అంతరార్థాన్ని అన్వయించి చూపారు. భగవంతుని చేరుకోవటానికి భక్తుడు పడే విరహవేదన, కలయికలోని ఆనందం కూడా దీనిలో దర్శనీయం.
యూదులు ఈ గీతాన్ని తమ పెద్దపండుగ 'పాస్కా' రోజుల్లో, క్రైస్తవులు దీన్ని మేరిమాత పండుగప్పుడు పాడుకుంటారు.
