-
-
పరాయోళ్ళు
Paraayollu
Author: G. Umamaheswar
Publisher: Palapitta Books
Language: Telugu
ఈ కథల్ని చదవడమంటే వర్తమాన సామాజిక చరిత్రలోకి ప్రయాణించడమే. గత ఇరవై ఏళ్ళ రాజకీయ, ఆర్థిక పరిణామాల ప్రభావం ప్రజల జీవితం మీద ఎలా ఉన్నదో ఈ కథలు చెబుతాయి. అయినప్పటికీ ఒక రాజకీయ వ్యాఖ్యానం చేయడం కోసమే కథలు రాశారన్న నిర్థారణకు రాకూడదు. ఆయా అంశాల పట్ల రచయిత కనబరచిన ఆసక్తి, సంవేదనలే కథా రచనకు ప్రేరణగా నిలిచాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు సంబంధించిన జీవిత వాస్తవికతలు, సాంస్కృతికపరమైన, భాషాపరమైన విలక్షణతలు ఈ కథలలో ఆవిష్కృతమయ్యాయి. గ్లోబలైజేషన్ పరిణామాలు ఎలాంటి జీవన విధ్వంసానికి దారితీస్తాయో ముందుగానే ఊహించడం రచయిత దార్శనికతని తెలియజేస్తాయి.
మామూలు సందర్భాల్ని ఎత్తుగగా స్వీకరించి కథల్లోకి పాఠకుల్ని తీసుకెళ్ళగలిగే నేర్పు కథనంలోని సుగుణం. ఈ కారణంగా కథల్లో ఎలాంటి ప్రబోధాలు ఉండవు. చదివే క్రమాన పాఠకులు కథలో భాగస్వాములవుతారు. వారిలో ఓ అసంకల్పిత క్రియాశీలతకు దోహదం చేస్తాయి.
- పాలపిట్ట బుక్స్
