• Panjaram Vidichi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పంజరం విడిచి

    Panjaram Vidichi

    Author:

    Publisher: J.V.Publications

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాఠకులకు నమస్కారం.

కథల మీద విమర్నో, సమీక్ష రాసేంత గొప్పవాడిని కాదు గానీ, చదివి ఆనందించేవాడ్నని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. పుస్తకం పంపింది జ్యోతి వలబోజు, కథలు వ్రాసింది స్వీటీ శ్రీపాద కాదు... స్వాతీ శ్రీపాద. కథలు స్వీట్‌గా వున్నాయని నేనే కాస్త చనువు తీసుకుని స్వీటీ శ్రీపాద అన్నాను. నిజం చెబితే వారి పరిచయం నాకు లేదు. కథలతో మాత్రమే పరిచయం.

'రచన' అనేది ఒకప్పటి సంగీతంలాగా, నృత్యంలాగా కొందర్ని మాత్రమే వరించే కళ. ఇప్పుడు రచన అనేది వ్రాయాలనుకునే ఆసక్తి వున్న ప్రతి సాధారణ వ్యక్తికీ లభించే ఆయుధం. ఒకప్పుడు కల్పన కథలో 50 నుంచి 60% వుంటే ఇప్పుడు కల్పనలు తగ్గి కథకే ప్రాధాన్యం లభిస్తోంది, ముఖ్యంగా 'రచయిత్రుల' కథల్లో, ఇది చాలా చాలా హర్షించదగిన విషయం.

స్వాతి శ్రీపాద కథలన్నీ దాదాపు మన సమాజంతో ముడిపడివున్నవే. సమాజ నేపథ్యం వున్న కథలెన్నున్నయ్యో కుటుంబ నేపథ్యం వున్న కథలు కూడా అంతేనో, అంతకన్నా ఎక్కువో కూడా వున్నాయి. కథల పేర్లు కూడా చక్కగా అమిరాయి.

'నేను'తో మొదలయ్యే కథల్లో రచయిత రచయిత్రి వ్యక్తిత్వం ఎక్కువగా ధ్వనిస్తుందంటారు. స్వాతిగారి వివిధ ముఖాలు మనకి ఆ కథల్లో గోచరిస్తాయి. కొన్ని కథలు నిరాశతో మొదలైనా అవి అంతమయ్యేది ఓ నవజీవనోత్సాహంతోనూ, చైతన్యంతోనూ. ఇది నిజంగా మెచ్చుకోదగిన అంశం. అలాగే ఆవిడ 'వ్యక్తి'నించి మొదలెట్టిన కథలు వ్యవస్థని 'స్పృశిస్తూ' ప్రశ్నించడం కూడా ఖచ్చితంగా మెచ్చుకోదగిన అంశమే. నేను ప్రతి కథా 'చదివే' నా అభిప్రాయం వ్రాస్తున్నానని మనవి చేస్తున్నాను. ఆమెనించి మరిన్ని కథలు రావాలి. ఎందుకంటే ఆవిడ ఏ కథలోనూ నేల విడిచి సాము చెయ్యలేదు గనక.

- భువనచంద్ర

Preview download free pdf of this Telugu book is available at Panjaram Vidichi