• Pandit Ram Prasad Bismil Ashfaqullah Khan Telugu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పండిత్ రాంప్రసాద్- బిస్మిల్ అష్ఫఖుల్లా ఖాన్ (తెలుగు) (free)

    Pandit Ram Prasad Bismil Ashfaqullah Khan Telugu - free

    Pages: 24
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారత స్వాతంత్ర్య సమరంలో అగ్నిశిఖలుగా పేర్కొనదగిన విప్లవకారులు శ్రీ పండిత రాంప్రసాద్ బిస్మిల్, శ్రీ అష్ఫాఖుల్లా ఖాన్. ఈ ఇరువురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్‌లో జన్మించారు. అక్కడి అబ్బీరిచ్ మిషన్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. చిన్ననాటి నుండి అంగ్లేయుల పట్ల వ్యతిరేకత పెంచుకున్న బిస్మిల్-అష్ఫాఖ్ ఉన్నత పాఠశాల విద్యార్థులుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1922 ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చౌరీ-చౌరా పోలీసుస్టేషన్ ను ఆగ్రహించిన ప్రజలు తగులబెట్టారు. ఈ దుస్సంఘటన దృష్ట్యా మహాత్మాగాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని విరమించారు. ఆ నిర్ణయం రుచించని శ్రీ బిస్మిల్, శ్రీ అష్ఫాఖ్ లాంటి యువకులు సాయుధ పోరాటం బాట పట్టారు. ఆ క్రమంలో శ్రీ బిస్మిల్ నేతృత్వంలో ఏర్పడిన హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్' లో శ్రీ అష్ఫాఖ్ భాగస్వామి అయ్యారు. ఈ విప్లవ దళం నిర్వహించిన కార్యక్రమాలలో అష్ఫాఖుల్లా ఖాన్ ప్రధాన భూమిక నిర్వహించారు.

1925 ఆగస్టు 3న హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ నిర్వహించిన ‘కాకోరి రైలు' సంఘటన ఆంగ్ల అధికారుల గుండెల్లో గుబులు రేపింది. ఈ సంఘటనకు శ్రీ బిస్మిల్ నేతృత్వం వహించగా శ్రీ అష్ఫాఖ్ మరో 8 మంది విప్లవకారులు ప్రధాన పాత్ర నిర్వహించారు. ఆ సంఘటన తరువాత ఆంగ్ల ప్రభుత్వం విప్లవకారుల మీద విరుచుకపడి పలువుర్ని అరెస్టు చేసి విచారణ జరిపింది. ఈ విచారణలో శ్రీ బిస్మిల్, శ్రీ అఫ్ఫాఖ్‌లతోపాటుగా శ్రీ రాజేంద్ర లహరి శ్రీ రాకూర్ రోషన్ సింగ్ లకు ఆంగ్ల న్యాయస్థానం ఉరిశిక్షలు విధించింది.

శ్రీ బిస్మిల్ ఆర్యసమాజికుడు కాగా శ్రీ బిస్మిల్ ఇస్లాం ధర్మపరాయణుడు. మాతృభూమి విముక్తి పోరాటానికి అంకితమైన ఈ వేర్వేరు మతస్థులకు మతం, ధార్మిక భావాలు ఏ మాత్రం అడ్డు రాలేదు. ఆ రోజుల్లో బిస్మిల్-అష్ఫాఖ్ హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతిరూపాలుగా నిలిచారు. ఒకరికోసం మరొకరు ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డ ఈ యువకులు ఆనాటి ప్రాణమిత్రులకు, విప్లవకారులకు ఆదర్శమయ్యారు. భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో స్ఫూర్తిదాయక సంఘటనగా పేర్కొన్న ‘కాకోరి రైలు సంఘటన’ నేర భారాన్ని పూర్తిగా తన నెత్తిన వేసుకుని శ్రీ రాంప్రసాద్ బిస్మిలను ఉరిశిక్ష నుండి తప్పించడానికి అష్ఫాఖ్ ప్రయత్నించారు. ఈ ఇరువురు మిత్రులు మాతృభూమి విముక్తి కోసం ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. 1927 డిసెంబర్ 19న ఉరిశిక్ష అమలు జరగనున్నదనంగా డిసెంబర్ 16న ఈ ప్రాణమిత్రులు మాతృభూమి విముక్తి కోసం, భారతీయుల ఉజ్వల భవిష్యత్తు కోసం మతం, కులం, ప్రాంతం లాంటి అవరోధాలను తొలగించుకుని చర్యంగా ముందుకు సాగాలని అజరామరమైన పిలుపునిస్తూ భరతమాత ముద్దుబిడ్డలు శ్రీ అష్ఫాఖుల్లా శ్రీ బిస్మిల్ అమరులయ్యారు.