-
-
పాండవుల గుట్ట
Pandavula Gutta
Author: Kanuganti madhukar
Publisher: Self Published on Kinige
Pages: 32Language: Telugu
క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం మధ్యకాలంలో పాండవులు జూదంలో తమ రాజ్యాలను కోల్పోయి, ఇచ్చిన మాట ప్రకారం పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేసినట్లుగా మహాభారతం చెబుతోంది. అరణ్యవాస సమయంలో పంచపాండవులు గుట్టలు, చెట్లు, అడవుల వెంట తిరుగుతూ జీవనం సాగించారు. ఆ క్రమంలో భాగంగా వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని తిర్మలగిరి గ్రామ శివార్లలోగల గుట్టలపైకి వచ్చినట్లుగా అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆ గుట్టలను అందుకే పాండవుల గుట్ట అని జనసామాన్యం పిలుచుకుంటారు. ఆ గుట్టలపై పాండవులు అరణ్యవాసం చేయడం వలన ఆ గుట్టలకు పాండవుల గుట్టగా పేరు వచ్చిందని ఆ ప్రాంతవాసులు కథలుకథలుగా చెప్పుకుంటారు.
ఈ గుట్టలు హన్మకొండ నుంచి 45 కిలోమీటర్ల తరువాత, మహాదేవ్‌పూర్ రోడ్డు మీదుగా, మూడు కిలోమీటర్ల దూరంలో వుంటాయి. ఉత్తరం నుంచి దక్షిణానికి ఇవి వ్యాపించి ఉంటాయి.
ఈ గుట్టల గురించిన సమగ్ర సమాచారమే ఈ చిన్ని పుస్తకం.
