-
-
పంచసాయకం
PanchaSayakam
Author: Sridhara Srirama Krishna
Publisher: Mohan Publications
Pages: 128Language: Telugu
పద్మిని చతుర్దశి, పూర్ణిమ, పంచమి, విదియ తిధుల లో రతికి ఇష్టపడును. దశమి, షష్ఠి, అష్టమి, సప్తమి తిధుల లో చిత్రిణి ప్రసన్నురాలగును. ఏకాదశి, త్రయోదశి, సప్తమి, చతుర్దశి తిధుల లో శంఖిని ప్రసన్నురాలగును. అమావాస్య, పాడ్యమి, తదియ, నవమి, ద్వాదశి తిధుల లో హస్తినీ జాతి స్త్ర్రీ సురతమునకు ఇష్టపడును.
తిధి - జాతి విశేషములు స్త్రీ సంభోగమునకు ఒకప్పుడు ఉపయోగించును. ఆమె రజోదర్శనమునకు, చంద్ర కళలకు పూర్తి సంబంధము గలదు.
సామాన్యముగా చంద్రకళా ప్రభావము స్త్ర్రీ అంగ, ప్రత్యంగముల పైన, సమయ, స్థానములపైన ఉండును. శుక్ల పక్షమున తిధి క్రమముగా కామభావము స్త్రీ శరీరము నందు అంగ విశేషములపై ఆధారపడి ఉండును. పాడ్యమి-బొటన వ్రేలు, విదియ-పాదములు, తదియ - బాహువులు, చవితి - పిక్కలు, పంచమి - నాభి, షష్ఠి - వక్షఃస్థలము, సప్తమి- నడుము, అష్టమి-కంఠము, నవమి -మెడ, దశమి - పెదవులు, ఏకాదశి - నేత్రములు, ద్వాదశి - చెవులు, త్రయోదశి - శిరస్సు, పూర్ణిమ రోజున శేష భాగమునందు మన్మధుడు నివాసముండును. కృష్ణ పక్షమున శిరోభాగము నుండి కాలిబొటన వ్రేలి వరకు ఉండును. ప్రత్యేక తిధుల లో ఇచ్చట నచ్చట లేడను సందేహము ఉండదు.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE