-
-
పలుకులమ్మ తోటమాలి
Palukulamma Totamali
Author: Multiple Authors
Publisher: Lanka Suryanarayana gari Kutumbam
Pages: 240Language: Telugu
Description
సూర్య స్పృహ
అతడొక ప్రవహిస్తున్న సముద్రం
జూలుగొని, సుడిగొని, వరదగొని
తానే సముద్రంగా మారిపోయిన వాత్సల్యవారధి
అల తానే, పోటు తానే, ఉప్పెన తానే
చెలియలికట్ట తానే
వసుధ చాలనంత స్వైరి
ప్రేమతో పండిన సంగడి
వెరసి భావన కందనంత సజీవస్వప్నం
కళ్లెదుట నడయాడే ఒక మార్మిక విజ్ఞానస్వర్గం
ప్రపంచాన్ని పవిత్రంగాను
పవిత్రతలో సంవేదనని చేర్చడానికి
లక్షల యిటుకలు చేర్చి
చైతన్యసేతువును నిర్మించిన అభినవ విశ్వకర్మ
దేవాలయం దివ్యాలయమే గాక
దేదీప్యమానమై జ్ఞానాలయమైంది
అత్తవాకిటి మొగసాలనే
కోడలిని కూర్చోబెట్టడం కనబడని గడుసుదనం
ప్రపంచమంతా ధనం చుట్టూ తిరుగుతున్న కాలంలో
పుస్తకం చుట్టూ పరిభ్రమించిన ‘పొద్దు’
అంతిమంగా మనిషి చేరుకునే
అతిశక్తివంతమైన శూన్యం
నాది కానిదేదీ నాకొద్దనుకునే లోకంలో
తనకున్నది ప్రపంచానికి పరచిన విశ్వాభిచరుడు
ఎఱుక అపారమైనా
స్థాణువులా కనిపించే హిమసౌభాగ్యం
కనుమాసిన తెల్లటి ఆవరణంలో
మంద్ర ప్రశాంతమైన ఒక పలకరింపు
ఎదుటిని పెద్దసేయడం తప్ప
ఏ మాత్రం ప్రతిపత్తి ఎరుగని పాటుమానిసి
నిలువెత్తు అభిమానం
కనిపించని అభిమానం
కనిపించని ఆత్మాభిమానం
సముద్రసేతువంత గెలుపు
అందరికీ అందుబాటులోని పిలుపు
అందుకే నా యీ కైమోడ్పు
- భూసురపల్లి వేంకటేశ్వర్లు
గమనిక: "పలుకులమ్మ తోటమాలి" ఈబుక్ సైజు 8.6mb
Preview download free pdf of this Telugu book is available at Palukulamma Totamali
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- ₹270
- FREE
- FREE