-
-
పలుకుబడి - 2
Palukubadi 2
Author: Thirumala Ramachandra
Publisher: Veteran Journalist's Association
Pages: 108Language: Telugu
రామచంద్ర గొప్ప పండితుడు, బహుభాషావేత్త. నిర్విరామ పరిశోధకుడు. విమర్శకుడు, సాహిత్యసమీక్షకుడు, అనువాదకుడు, బహుగ్రంథకర్త. వీటన్నిటినీ పత్రికా రచనా వ్యాసంగాన్ని అలంబనగా చేసుకునే సాధించగలిగాడు.
కొత్త శాస్త్రీయాంశాల ఆవిష్కరణలు జరిగినప్పుడు కొత్త పదసృష్టి అవసరమవుతుంది.ముందుగా ఈ సమస్య పత్రికారచయితల ముంగిట్లో వాలుతుంది. 175 ఏళ్లుగా తెలుగు పత్రికారచనలో ఇది అందరూ ఎదుర్కొన్న సమస్యే శక్తిమేరకు పరిష్కరించుకొంటూ వస్తున్నదే. వీరేశలింగం పంతులు నుంచి ప్రారంభించి కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, నార్ల వెంకటేశ్వరరావు, ఆ తర్వాత మా తరం వరకు అందరి కృషి ఉంది. ఆ కృషిలో రామచంద్ర వంటి పాళీ, ప్రాకృత, సంస్కృత తదితర భాషలు క్షుణ్ణంగా తెలిసినవారి పాత్ర అవిస్మరణీయమైంది, ఆదర్శవంతమైంది.
పలుకుబడి శీర్షిక క్రింద తిరుమల రామచంద్ర వ్రాసిన వ్యాసాలు దొరికినంత వరకు తొలి ప్రచురణగా ప్రచురించాము. ఆ తరువాత లభించిన ఇతర వ్యాసాలను పలుకుబడి-2 గా ప్రస్తుతం వెలుగులోకి తెస్తున్నాము. భాషాసేవలో ఇది ఇంకొక ముందడుగు అవుతుందని విశ్వసిస్తున్నాము. ఈ గ్రంథాన్ని భాషా ప్రియులు, ముఖ్యంగా నవతరం పత్రికా రచయితలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.
- డా. జి.యస్. వరదాచారి
veeraa83:
Hai I bought an ebook in kinige and tried it on "Adobe Digital editions" app in android. It worked fine till the end, no lagging. Give it a try.
This book is not opening beyond 2nd page in bluefile reader in ios. Even in Aldiko reader in Android, it takes longer time to open and some times hangs, but somehow it opens finally.