• Pallesrujana March April 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పల్లెసృజన మార్చి - ఏప్రిల్ 2015

    Pallesrujana March April 2015

    Pages: 35
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"A Magazine on Grass Roots Innovations"

గత పదేళ్ళుగా ‘పల్లెసృజన’ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో గ్రామీణ శాస్త్రవేత్తలను వెతుకుతూ వారిని వెలుగులోకి తీసుకు రావడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నది. ఇప్పటికే వివిధ గ్రామాల నుండి నూటయాభై మందికి పైగా ఇన్నోవేటర్లను వెలుగులోకి తెచ్చి వారికి గుర్తింపునందించింది. 12 జాతీయ అవార్డులు రాష్రపతి ద్వారా మన తెలుగు ఇన్నోవేటర్లకు లభించటానికి కారణభూతమైంది. ఎన్నో స్థానిక గుర్తింపులు, సత్కారాలు, కాలేజీ, స్కూలు విద్యార్థులతో చర్చలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులతో సంధానాలు, మీడియాపరంగా పరిచయాలు.... ఇలా ఎన్నో ‘పల్లెసృజన’ సాధించినా, సాధించాల్సింది ఇంకా ఎంతో వుంది.

‘పల్లెసృజన’ స్వచ్ఛంద సంస్థగా పూర్తిగా వాలంటీర్లపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పత్రిక కూడా వాలంటీర్ల సహాయంతోనే నడుపుతున్నాం. గత పది సంవత్సరాలుగా పల్లెసృజన కార్యక్రమాల్లో పాల్గొనే వాలంటీర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకా వేలమంది ముందుకు రావాలి. స్థానిక జ్ఞానాన్ని వెతకాలి, వెలికి తీయాలి, వెలుగులోకి తేవాలి. స్థానిక జ్ఞానం, స్థానిక పరిష్కారాలు, మనుష్యులను, ప్రకృతిని కాపాడుతాయి. జ్ఞాన ఆధారిత సమాజానికి బలం చేకూరుస్తాయి. గ్రామీణ పరిష్కారాలన్నీ ఆధునిక సైన్సులోని టెక్నాలజీ ఆధారిత పరిష్కారాల్లా ఉండవు. వీటిలో టెక్నాలజీ ఒక భాగం మాత్రమే. జీవజాతి, ప్రకృతి, సుస్థిరత ప్రధానంగా ఉండే ఈ గ్రామీణ జ్ఞానాన్ని విద్యార్థులకు, యువకులకు పరిచయం చేయాలి. వారు దీన్ని కూలంకషంగా అధ్యయనం చేసి దేశాభివృద్ధికై ఉపయోగించాలి.

పల్లెసృజన సేకరించిన ఇన్నోవేషన్లు చాల ఉపయోగకరంగా అందుబాటు ధరలో ఉంటాయి. సరళమైన టెక్నాలజీతో వాడటంలో కాని, మెయింటెయిన్‌ చేయటంలో కాని క్లిష్టమైన పద్ధతులు లేకుండా సులభంగా ఉంటాయి. తయారు చేయడం కూడా చాలా సులభం. భారీ మెషినరీ కాని, వినూత్న ఇంజనీరింగ్‌ పద్ధతులు కాని, ప్రత్యేక ముడిసరుకులు కాని అవసరం లేకుండా, స్థానికంగా లభించే సామాగ్రితోనే వీటిని తయారు చేయవచ్చు. ఇన్ని సౌలభ్యాలున్న ఈ గ్రాస్‌రూట్స్‌ ఇన్నోవేషన్లు అందరికీ చేరటం లేదన్న విషయం పల్లెసృజనకు భారంగా, బాధగా వుంది. పల్లెసృజన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది కాని, అందరికీ చేరటం లేదన్న లోటు కనిపిస్తోంది. ఈ పల్లెజ్ఞానం గురించి అందరికీ తెలియాలి, అందరూ దీని సుగుణాలను గురించి అవగాహన చేసుకుని వారు వాడుతూ, ఇతరులకూ వ్యాప్తి చేయాలి. పారిశ్రామికవేత్తలు వీటి ప్రాముఖ్యతని అర్థం చేసుకుని ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి తేవడానికి ముందుకు రావాలి. ప్రభుత్వం, ప్రజలు, సామాజిక సంస్థలు కూడా ప్రోత్సహించాలి.

పల్లెసృజన వెతికి వెలికితీసిన ‘‘రైతులకై రైతుల పరిష్కారాలు, ప్రయోగాలు’’ విస్తారంగా అందరికీ చేరవేయాలన్నది మా యజ్ఞం. ఈ యజ్ఞాన్ని ఎలా విజయవంతం చేయాలో పాఠకులు సలహాలిచ్చి, మాకు మార్గదర్శకత్వం చేయవలసిందిగా కోరుతున్నాం.

‘మన్మథ నామ’ సంవత్సరంలో పల్లెజ్ఞానం విస్తృతంగా వ్యాప్తి చెందాలని కోరుకుంటూ.....

- సంపాదకులు

Preview download free pdf of this Telugu book is available at Pallesrujana March April 2015