• Pallavi Leni Pata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పల్లవి లేని పాట!

    Pallavi Leni Pata

    Author:

    Pages: 223
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ పుస్తకం - ఒక నవలికా; 'కుల విధానం' గురించీ, 'దెయ్యాల శాస్త్రం' గురించీ, 'మార్క్సిజం' గురించీ కొన్ని వ్యాసాలూ కలిసిన సంపుటం.

* * *

ఈ పుస్తకంలో వున్న ఎక్కువ వ్యాసాలు, 'వర్గాలకూ - కులాలకూ' సంబంధించినవి. ఆ అన్ని వ్యాసాల్లోనూ వున్నది ఒకే సమస్య, ఒకే పరిష్కారం. కానీ, చర్చించిన కోణాలు వేరు వేరు.

ఈ పుస్తకంలోనే వున్న ఇతర వ్యాసాల్లో కొన్ని, ''దెయ్యాలూ - పర లోకాలూ కూడ సైన్సు విజ్ఞానమే'' అని చెప్పే అజ్ఞాన శాస్త్రం మీద విమర్శనా వ్యాసాలు.

ఏదైనా ఒక సమస్య మీద వాదోపవాదాలు జరిగితే, అందులో హేతుబద్దమైన వాదం కనపడితే, మన వాదం తప్పుగా వున్నట్టయితే, మనం మన వాదాన్ని తప్పకుండా మార్చుకోవాలి. అది ఎదటి వాళ్ళ కోసం కాదు ; మన కోసమే, మన అభివృద్ధి కోసమే.

ఈ పుస్తకంలో వున్న చిట్ట చివరి వ్యాసం, మార్క్సిజాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడనికి అవసరమైనది. ఆ అవసరం కోసమే చర్చించదగ్గది.

'పల్లవి లేని పాట'లో, రెండు రకాల చర్చలు వున్నాయి, 'కుల భేదాల' గురించీ, 'ప్రేమ సంబంధాల' గురించీ. ఈ చర్చల్ని కూడ పరిశీలించండి!

Preview download free pdf of this Telugu book is available at Pallavi Leni Pata
Comment(s) ...

రంగాజీ గారి అన్ని పుస్తకాల్లాగే ఇది కూడా నాకు బాగా నచ్చింది... కొత్త విషయాలు నేర్చుకున్నాను... కార్ల్ మార్క్స్ చేసిన పొరపాటు రంగాజీ బాగా చెప్పారు... అయితే ఒక చోట రంగాజీ గారు పొరపాటు చేసారు...
"విద్య నిగూఢ గుప్తమగు..." పద్యాన్ని గురించి చెప్తూ, అందులో "విద్య నృపాల పూజితము" అన్నదానికి "విద్య ప్రభువులని/రాజులని పూజిస్తుంది" అన్నది అర్థం అని చెప్పారు.. కానీ దానికి అర్థం "విద్య ప్రభువులని పూజిస్తుంది" అనికాదు, "విద్య ప్రభువులచే పూజించబడుతుంది" అని. ఇదే కవి ఆ శతకం లోనే ఇంకోదగ్గర "ప్రభువులు పందితులగు వారి వలన" అనే పద్యం లో "మీ కలిమి తృణము..." అని రాసాడు.. అంటే, విద్య గల పండితుల ముందు మీ (ప్రభువుల) సంపదలు గడ్డి పోచల వంటివి అని... అంటే ప్రభువుల కన్నా పండితులే గొప్ప వారని కవి అభిప్రాయం... అలాంటి అభిప్రాయమున్న కవి, విద్య ప్రభువులని పూజిస్తుంది అనే అర్థం లో రాయడు కదా..., విద్యయే ప్రభువుల చేత పూజింపబడుతుంది అనే అర్థం తోనే రాసాడు...