• Palivela Linga Satakamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పలివెల లింగా శతకము (free)

    Palivela Linga Satakamu - free

    Pages: 70
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శివుడంటే అవ్యక్తానందం. శివుడంటే రసప్రవాహం. శివుడంటే సత్యానుభవవిహారం.
అమెరికాలో ఉంటున్నా స్వామిపై భక్తి పుట్టి, స్వామిపై శతకం వ్రాద్దామని సంకల్పం కలిగింది. స్వామి దయతో అమెరికాలో ఉండగా శతకం పూర్తయింది.
తరువాత నివాసం ఆస్ట్రేలియాకు మారింది. స్వామిదయ ఇప్పుడు కలిగి, ఆవిష్కరణ జరుపుకుంది.

ఇలా మూడు ఖండాల సాక్షిగా, కర్మభూమి భరతఖండంపై ఆవిష్కరింపబడుతున్న ఒక ప్రవాస భక్తుని భక్తి శతకం ఈ పలివెల లింగా శతకం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి దగ్గరలో ఉన్న పలివెల గ్రామంలో కొలువైన శ్రీఉమా కొప్పులింగేశ్వర స్వామి మహామహిమాన్వితుడు. భక్తులకు కొంగు బంగారం.
స్థలపురాణం ప్రకారం కౌశికీ నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న అగస్త్యమహాముని పార్వతీపరమేశ్వరుల కళ్యాణం వీక్షించలేకపోయానని దివ్యదృష్టితో చూడగా నిజంగా పార్వతీపరమేశ్వరులు కళ్యాణాంబరములలో ప్రత్యక్షమవుతారు. వారిని అలాగే అక్కడ ఏకపీఠంపై కొలువవ్వమని ముని కోరగా వారు కరుణతో ఏకపీఠంపై అవతరించారు. ఇలా ఏకపీఠంపై పార్వతీ పరమేశ్వరులు ఉన్న క్షేత్రం ఇదే కావటం విశేషం.

- తటవర్తి శ్రీకళ్యాణచక్రవర్తి

Comment(s) ...

కవి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి కలం నుండి వెలువడిన మరొక అద్భుతమైన పద్యమాల. ప్రతి పద్యం అణువణువునా భక్తిభావాన్ని పొదిగియున్న ముత్యాలహారం. ఇటువంటి శతకాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నాను.