-
-
పెయింటింగ్ కోర్సు
Painting Course
Author: G. D. Uma Prasanna
Publisher: Self Published on Kinige
Pages: 112Language: Telugu
నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టమండి. ముఖ్యంగా హస్తకళలు (హండి క్రాఫ్ట్స్) అంటే ఇంకా ఇష్టం. నేను ఈ పెయింటింగ్లను 1996వ సంవత్సరంలో నేర్చుకున్నాను. 2000వ సంవత్సరంలో సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ తరుపున సుమారు 200ల రకాల మోడల్సుతో ఒక ప్రదర్శనను కూడా ఇచ్చాను. కాని ఆ తరువాత ఉద్యోగం బాద్యతలు అంటు చాల రోజులు వాటిని పెద్దగా పట్టించు కోలేదు.. అలా అని సాధన చేయటం మాత్రం వదల లేదు. ఈమద్య నాకు తెలిసిన వాళ్ళు ఒకరు నేర్పించమని అడిగితే ఉచితంగానే నేర్పించాను.
ఇంకో ఇద్దరు ముగ్గురు నాదగ్గరకి వచ్చి “ఏదైనా పుస్తక రూపంలో వుంటే ఇవ్వండి” అని “మాకు నేర్చుకోవాలని ఉన్న ఇనిస్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకునే సమయం లేదు” అని అడిగారు. అప్పుడే నాకీ పుస్తకం రాయలనే అలోచన వచ్చింది. ఆంగ్లబాషలో చలా మంది చాల రకాలుగా దీన్ని వివరించారు.. కాని మన తెలుగు వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయాలన్న తపనతో ఈ పుస్తకాన్ని రాసాను.
ఇందులో ఇచ్చిన అన్ని డిజయునులు నా సేకరణలోనివి. కొన్ని నేను కొనుకున్నవి మరి కొన్ని మా గురువుగారి దగ్గర నుండి సేకరించినవి. బయట కోర్సులు నేర్చుకోవాలంటే ఎంతో ఖర్చౌవుతుంది. ఒక్కో కోర్సు ధర 800 నుంది 1000 ఇంక 1500 దాకా తీసుకుంటారు. మార్కెట్లో డిజయును పుస్తకాల ధర ఎంతో ఉంది. అందుకే అతి తక్కువ ధరకే 4 రకాల కోర్సులను నేర్చుకునే అవకాశం అందరికి కల్పించాలనుకున్నాను.
ఈ పుస్తకంలో కాఫి పెయింటింగు, గ్లాస్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్ చేసే విధానం, మీరు చేసుకునేందుకు వీలుగా దానికి సంబందించిన డిజయిన్లు, మరియు కొన్ని రకాల మోడల్స్, ఫాబ్రిక్ పెయింటింగ్ అనగా చీరలు, డ్రెస్స్, గుమ్మానికి వేసే కర్టెన్, దిండు కవరులు మొదలగువాని మీద చక్కటి రంగులతో డిజయిను చేసే విధానం. ఎలా చెబితే తేలికగా అర్థమవుతుందో స్టడిచేసి తయారు చేసిన కోర్స్ ఇది.
నేర్చుకోవాలన్న తపన, ఉపాధి పొందాలనే పట్టుదల మీకుంటే ఈ కోర్సు చాలా తేలికగా వస్తుందనటంలో ఎలాంటి సందేహము లేదు. ఏదైనా మొదలు పెట్టి వదిలేయకుండా సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి నైపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాము.
- జి.డి.ఉమా ప్రసన్న

