-
-
పైలా పచ్చీస్ జోక్స్
Paila Pachchees Jokes
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 72Language: Telugu
''రేఖా! ఎక్కడ వున్నావు. పాప ఏడుస్తోంది. ఊరుకోబెట్టు" అంటూ అరిచాడు హాల్లో కూర్చున్న భర్త.
''పాప పడుకుందండి.''
''మరి ఆ శబ్దం ఏమిటి?''
''నేనే.. పాప లేస్తుందని చిన్నగా పాట అందుకున్నాను.''
* * *
సోము : కొత్త రేడియోనా? బాగుంది.
రాము : ఇది జపనీస్ రేడియో తెలుసా?
సోము : అయ్యో! నువ్వు వాళ్ళ భాషను ఎలా అర్ధం చేసుకుంటావు?
* * *
భార్య బలవంతం మీద డాక్టర్ చెకప్‌కు వెళ్ళాడు విష్ణు.
'డాక్టర్ ...నాకు ఈ మధ్య ఏపనీ చేతనవట్లేదు....ఒళ్ళంతా ఏదోలా ఉంటుంది. ..మా ఆవిడ వంటలో సాయం చేయమంటుందా...నాకు చెయ్యబుద్ధి కాదు. తను 'ఈ బిల్లు కట్టు, అవి తే ' అని ఏవో పనులు చెబుతుందా? అవీ చెయ్యట్లేదు. నాకు ఏమైందంటారు?' అడిగాడు విష్ణు.
'మీకు ఏ రోగమూ లేదు... బద్ధకం తప్ప' చెప్పాడు డాక్టర్.
'ఆఁ....అదే డాక్టర్ దాన్నే వైద్య పరిభాషలో ఏమంటారో చెబితే. ఆ విషయం మా ఆవిడతో చెబుతాను... నన్ను ఇక విసిగించదు.' నెమ్మదిగా అన్నాడు విష్ణు.
