-
-
పగటివేషాలు సామాజిక అంశాలు
Pagati Veshalu Samajika Amshalu
Author: Tata Ramesh Babu
Pages: 90Language: Telugu
ఆంధ్రదేశంలో 12వ శతాబ్దం నుండి 'పగటివేషాలు' ప్రచారం పొందినట్లు తెలుస్తోంది.
ప్రజావినోదం ప్రధానంగా ప్రజల ఆశలకు, ఆశయాలకు దర్పణంగా పగటివేషాలు ప్రచారం పొందాయి. నాటి పరిపాలికుల దృష్టికి ప్రజాసమస్యలు తీసుకు రావడంలో ఇవి ఉపయోగపడ్డాయి.
ఇతిహాసాలు మొదలైన వాటి నుండి పుట్టుకొచ్చిన వేషాలు అనాటి, ఈనాటి, రేపటి జీవితాన్ని మనకు చూపిస్తాయి. సామాజిక పరిస్థితులు, మనిషిలోపలి విధ్వంసం గురించి చెప్తాయి. ఒక పరమ ప్రయోజనమాశించి మనిషిలో ఆశను కలిగిస్తాయి. మంచి వైపు ఆలోచించి, మంచి జీవనానికి దిక్సూచిగా ఉంటాయి.
వేల సంవత్సరాల చరిత్రలో వందల పగటివేషాలలో కొన్ని అంతరించి పోవచ్చు. మరికొన్ని అంతరించే దశలో ఉండవచ్చు. మరికొన్ని నూతన రూపాన్ని సంతరించుకునే మార్గంలో ఉండవచ్చు.
కొన్ని పాత్రల అవసరం తీరిపోయింది. కొన్ని పాత్రలు సామాజిక మార్పులవల్ల అదృశ్యమైనాయి.
కొన్ని పాత్రల ఆధునిక రూపాలను మనం చూస్తునే ఉన్నాం. ఈ నాటి రకరకాల పాత్రలకు, వేషాలకు పగటి వేషాలే మూలం.
