-
-
పద్యనాటక పంచకం
Padya Nataka Panchakam
Author: R. A. Padmanabha Rao
Publisher: Self Published on Kinige
Pages: 128Language: Telugu
గత ఐదు దశాబ్దులుగా నేను దాదాపు 120 గ్రంథాలు ప్రచురించాను. అన్ని సాహిత్య ప్రక్రియలలోను రచనలు చేశాను. పద్యనాటక ప్రయత్నం ఇదే మొదలు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర డైరెక్టర్ శ్రీమతి యం. కృష్ణకుమారి ఒకసారి “మీ సిద్ధాంత గ్రంథం ఆధారంగా ఒక నాటకం వ్రాసి పంపగూడదా?” అన్నారు. కందుకూరి రుద్రకవిపై పరిశోధన చేసి 1976లో షి.హెచ్.డి. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి సంపాదించాను. నిగమశర్మ వంటి ధూర్త నాయకుల గూర్చి అనేక సభలలో ప్రసంగించాను. నిరంకుశుడు అనే పద్యనాటకం వ్రాసి పంపాను. అది విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.
ఆ కోవలోనే తిమ్మన పారిజాతాపహరణం పద్యనాటకంగా వ్రాశాను. మిత్రులు, నా శిష్యులు అయిన డా. కొట్టే వేంకటాచార్యుల బృందం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారం చేశారు. తెలంగాణా సాంస్కృతికశాఖ సౌజన్యంతో వేంకటాచార్యులు రంగస్థల నాటకంగా మార్పులు చేసి దీనిని ప్రదర్శించి మెప్పు పొందాడు. అక్కిరాజు సుందరరామకృష్ణ శ్రీకృష్ణ పాత్ర ధరించారు.
ఆ ఉత్సాహంతో వరూధినీ పద్యనాటకం విశాఖపట్టణం కేంద్రం నుండి ప్రసారం చేశాను. మిత్రులు, ప్రముఖ జ్యోతిష్కులు కాకరపర్తి సత్యనారాయణ ఒక నాటక బృందం ద్వారా దీనిని ప్రసారం చేశారు. కడప కేంద్రం నుండి యామినీ పూర్ణతిలక నాటకం మిత్రులు పోసా శివశంకర్ ప్రసారం చేశారు.
ఐదు నాటకాలు పూర్తి చేద్దామని కచ దేవయాని కథ ఆధారంగా దేవయాని పద్యనాటకం వ్రాశాను. ఈ ఐదు పద్యనాటక పంచకంగా ముద్రిస్తున్నాను. పద్యనాటక ప్రభావం అమోఘం.
- డా. ఆర్. అనంతపద్మనాభరావు
