-
-
పాడుకుందాం
Padukundam
Author: Manchi Pustakam
Publisher: Manchi Pustakam
Pages: 178Language: Telugu
ఈ పుస్తకం " 'చదువు'ల సారం" అనే శీర్షికతో వెలువడిన పుస్తకాల సిరీస్లోనిది. ఇది డిపిఇపి ద్వారా ప్రచురితమైన 'చదువు విజ్ఞానం' పత్రిక నుండి సేకరించిన గేయాల సంకలనం.
* * *
అమ్మా! అమ్మా! ఆడుకోవడానికి
పోనీయమ్మా! కింద నది పిలుస్తోంది.
పైన సెలయేరు పిలుస్తోంది.
వద్దు తల్లీ వద్దు.
బంగారు తల్లీ వద్దు
ఆటపాటల్లో టైం వృధా చెయ్యొద్దు
అమ్మా వినమ్మా! నది పాడుతోంది.
గాలి ఈల పాట వినబడ్డం లేదా
చెట్లకొమ్మల్లోంచి
ఆకులన్నీ హాయిగా ఊగుతున్నాయ్
వానమబ్బుల్ని చూసి
నెమళ్ళు నాట్యం చేస్తున్నాయ్
అమ్మా! ఆడుకోవడనికి పోనీయమ్మా!
అమ్మా! నా నేస్తాలు పిలుస్తున్నారు
మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు.
వద్దు తల్లీ వద్దు!
బలాదూరంటూ తిరిగే నేస్తాలు వద్దు.
చదువుకోనే తల్లీ! బంగారుతల్లీ!
అమ్మా! చూడమ్మా!
పగటి వెలుతురు జలతారులో కొండలెలా
మెరుస్తున్నాయో చూడు
నా నేస్తాలంతా బయటే ఉన్నారు.
నన్ను బయటికి పోనీయమ్మా
మిన్నీ! వద్దన్నానా! వినబడలేదా?
అమ్మా! నా నేస్తాలు పిలుస్తున్నారు.
బయటకు రమ్మని అరుస్తున్నారు.
పాడుకొందాం రమ్మంటున్నారు
బోలెడు ఆటలాడాలి రమ్మంటున్నారు
అమ్మా! నా ప్రియమైన అమ్మవు కదూ!
నన్ను బయటికి పోనీయమ్మా!
మిన్నీ! వద్దంటే నీక్కాదూ!
పోయి పుస్తకాలు తియ్యి!
బయటికి పోయేది లేదు
బుద్దిగా చదువుకో! అంతే!
- మూలం: శాంతా రామేశ్వరరావు, అనువాదం: కె. సత్యవతి, ఎన్. గీత (భూమిక),
