-
-
పడి లేచిన కెరటం
Padi Lechina Keratam
Author: Ganti Bhanumathi
Publisher: Ganti Prachuranalu
Pages: 154Language: Telugu
ఆమె కళ్ళనిండా కలలు. ఏదో చేయాలన్న కోరిక, ఓ యాంబిషన్, గుండె నిండా భవిష్యత్తు గురించిన ఆశలు ఉన్నాయి. కాని అనుకోని విధంగా, ఊహించని విధంగా జీవితం తల్లకిందులైంది.
ఆ కలలన్ని ముక్కలై పోయాయి. ఏరుకుని అతికించుకుందామనుకున్నా ఒక్క ముక్క కూడా చేతికంద లేదు. ఆశలన్ని ఆవిరైపోయి పొగమంచులా భవిష్యత్తుకి మసకేసింది. ఉన్నట్టుండి భోరున ఏడుస్తుంది, సాంత్వన కోసం. అటూ ఇటూ చూడాలనుకోలేదు. తనకి తాను ఒంటరితనపు లోయలోకి జారిపోయింది. ఎవరితోనూ మాట్లాడాలనుకోదు.
కాలేజీకి వెళ్ళడం కోసం బస్టాండు వరకూ వెళ్ళి, ఎవరో తరుముతున్నారంటూ భయం వేస్తోందని ఇంటికి వచ్చేసింది. చదువు మీద శ్రద్ధ పోయింది. కాలేజీ మానేసింది. పుస్తకాలు పట్టుకోడం మర్చిపోయింది. రెండుసార్లు మణికట్టు కోసుకుంటుంది. ఆత్మహత్యా ప్రయత్నం చేయబోతుంది. చనిపోవాలనుకుంటుంది. ఇది శృతి మానసిక స్థితి. డిప్రెషన్ అన్నారు.
ఆమె అక్షరాలు మర్చిపోయింది. ఆఖరికి పెద్ద బాలశిక్ష కూడా చదవలేక పోతుంది. ఆమె పరిస్థితి దిగజారుతోందని ఆమె తలిదండ్రులు డాక్టరు దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళ ఆసుపత్రిలో చేరుతుంది. ఇంత సీనియర్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి నెలలు పడుతుంది.
ఇది శృతి కథ. ఆమె జీవితం, మానసిక స్థితి, అందులోంచి వచ్చిన ఘర్షణ, పోరాటం. ఇప్పుడు భవిష్యత్తు కోసం ఆమెకి కలలేం మిగల్లేదు. కొత్త కలని కనాలని లేదు. ఇది వాస్తవం అని చెప్పను, కాని వాస్తవానికి దూరంగా లేదు. కొత్తగా మారిన శృతి, కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది. శృతి వెలుగు నీడల జీవితం ఈ పడి లేచిన కెరటం, ఇదే శృతి కథ.
- గంటి భానుమతి
