-
-
పథకం
Padhakam
Author: Manjari
Publisher: Sagar Publications
Pages: 222Language: Telugu
సూరి బైక్ స్టార్ట్ చెయ్యబోతుండగా సెంట్రీ గబగబా వచ్చి చెప్పాడు.
``సార్! ఫోన్.”
బైక్ స్టాండ్ వేసి వెళ్ళి రిసీపర్ తీసుకున్నాడు.
``సబ్ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను...”
``పదినిముషాల క్రితం గూడ్సు ఒకటి బరంపురం రైల్వేస్టేషన్ దాటి ఇచ్ఛాపురం వైపు బయలుదేరింది... వింటున్నారా?” ఓ గొంతు మత్తుగా అడిగింది.
చెప్పండి...
``ఇంజన్ వెనుక బోగీ తొమ్మిదిలో బొగ్గుకింద గోనెసంచులో మద్యం సీసాలు రవాణా అవుతున్నాయి...”
``అవి ఎక్కడకి వెళుతున్నాయి?”
``ఆంధ్రప్రదేశ్లోని కొత్తవలస రైల్వేస్టేషన్లో అన్లోడవుతాయి.”
``ఎవరు పంపుతున్నారు?”
``తెలియదు.”
``పోలీస్ డిపార్టుమెంట్కి సాయపడే మీలాంటి బాధ్యతగల పౌరునికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. సమాచారం ఇచ్చిన వారికి డిపార్ట్మెంట్ ప్రోత్సాహక నగదు బహుమతి యిస్తుంది. మీ వివరాలు చెప్పండి” అడిగాడు సూరి. బదులుగా ఫోన్ డిస్కనెక్ట్ అయింది.

- ₹108
- ₹140.4
- ₹108
- ₹86.4
- ₹129.6
- ₹108