-
-
పదండి ముందుకు
Padandi Munduku
Author: Aruna Pappu
Publisher: Vignan Publishers Limited
Pages: 222Language: Telugu
Description
పదండి ముందుకు
విజ్ఞాన్ రత్తయ్య జీవన కెరటాలు, కథనం: అరుణ పప్పు
'విజ్ఞాన్' అంటే గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నాల్లోని కొన్ని భవనాల సముదాయం కానే కాదు. విజ్ఞాన్ అంటే కొన్ని విలువలకు చిరునామా. మార్కుల్లో ఆధిక్యం ఒక్కటే కాదు, మానవత్వం, సామాజిక అవసరాలకు సత్వరమే స్పందించే గుణం, తనమీద తనకు ప్రేమ, ఇతరుల పట్ల గౌరవం, మొత్తంగా జీవితం పట్ల సంతృప్తి... ఇదీ విజ్ఞాన్ డిఎన్ఏ అవాలి.
ఆ డిఎన్ఏను అందిపుచ్చుకున్న విద్యార్థులే విజ్ఞాన్ అంటే.
పెద్దల ఆస్తులకు కాదు, ఆశయాలకు వారసులుగా యువతరం ఎదగాలి. పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో జీవితంలో ఉన్నతమైన విజయాలు సాధించాలి. దానికోసమే మా పిల్లలతో సహా, ముందు తరం వారంతా 'పదండి ముందుకు'.
- లావు రత్తయ్య
Preview download free pdf of this Telugu book is available at Padandi Munduku
"పదండి ముందుకు" పుస్తకంగా రాక ముందే నవ్య వీక్లీలో వారం వారం ఎంతో ఉత్సాహంగా ఉత్సుకతతో చదివాను. నేను స్వయానా విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్ మరియు ఇంజినీరింగ్ చదివాను. ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. కస్టపడే తత్వం, పోటీ ప్రపంచంలో నెగ్గడం వంటివి ఇక్కడే అలవడ్డాయి అనడంలో సందేహం లేదు. మనకు తెలిసిన వ్యక్తి గురించి తెలియని గొప్ప నిజాలు అరుణ పప్పు గారు రాసిన ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవడం ఒక గొప్ప అనుభూతి. స్వయంగా పరిచయం లేకపోయినా విద్యార్ధులకు, తల్లిదండ్రులకు "విజ్ఞాన్ రత్తయ్య" అనే పేరు ఆంధ్ర దేశం అంతా సుపరిచితం. ఎందరో విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఈ విజ్ఞాన్ సామ్రాజ్యపు నిర్మాణం వెనక ఉన్న కస్టం, ఓర్పు, నేర్పు ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి శక్తి గా ఎలా ఉద్భవించాడో తెలుసుకోవచ్చు. విద్యారంగానికి ఎంతో సేవ చేసిన రత్తయ్య గారి గురించి అందరూ తప్పక చదవాల్సిన అవసరం ఉంది. అరుణ పప్పు గారి రచన ఆద్యంతం అద్భుతంగా సాగి పాఠకులను రంజింపజేస్తుంది. ఇంకెందుకు ఆలశ్యం..పుస్తకం చదివేందుకు...పదండి ముందుకు..