• Padana Tenugu Pata
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పాడనా తెనుగు పాట

  Padana Tenugu Pata

  Pages: 231
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

గతంలో (దాదాపు 65 సం|| క్రితం) సినిమా విడుదలైనప్పుడు, పాటలపుస్తకాలు సినిమాహాళ్లలో అమ్మేవారు. అందులో పాటలసాహిత్యం, కవి, సంగీతదర్శకుల వివరాలు సంక్షిప్తంగా సినిమాకథ, సినిమాలోని కొన్ని ఛాయాచిత్రాలు పొందుపరచేవారు. ఆ పుస్తకాలను పొదువుకొని గర్వంగా దాచుకున్న వారెందరో. కొన్ని రైల్వేస్టేషన్లలో పాటల పుస్తకాలు అమ్మేవారు. అన్నీ తప్పులే - అవి అలాగే ఆ తప్పులతోనే పాడబడేవి దురదృష్టవశాత్తూ, ఇహ ఇప్పుడు ఏ పాటకోసమైనా 'గూగుల్' లో వెదికితే, ఎవరో వారికి తెలిసిన సాహిత్యం అందులో పొందుపరచడం, ఆధునిక గాయనీగాయకులు వాటినే సెల్ ఫోన్లలో చూస్తూ ఆ తప్పులతోనే పాడటం జరుగుతోంది. నేను సైతం 'పాడుతాతీయగా'లో కొన్ని సందర్భాల్లో చేసిన తప్పిదాలను సరిదిద్ది, నేను తరువాతి కార్యక్రమ సంచికలో దిద్దుబాటు చేసుకోడానికి ఎంతోమంది సినీగీతపరిశోధక మిత్రులు దోహదపడుతున్నారు. కానీ ఈ సన్మిత్రులు ఎంతమందికి తెలుసు? ఎవరికి వీరిని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలనే ఓపిక ఉంది? ఈ సందర్భంలో, పి. సుశీలగారు ఆలపించిన 'సోలో' పాటలను వ్యాఖ్యానిస్తూ సన్మిత్రులు డా. కంపల్లె రవిచంద్రన్ ‘పాడనా తెనుగుపాట' అన్న ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చారు. పి. సుశీలగారు ప్రతిభకు మారు పేరు. అనర్ఘమైన ఆమె స్వరం దైవదత్తమైన వరం. ఆమె పాటలోలేని సొగసు లేదు. ఆమె పాటను మెచ్చుకోని మనసులేదు. ఆమె గానం సర్వసౌభాగ్యసంపన్నం. మధుర సంగీతచరిత్రలో ఆమెది అగ్రగణ్యమైన శాశ్వతస్థానం.

ఈ పుస్తకంలో సాధ్యమైనన్ని పి. సుశీల పాడిన మంచిపాటల (1954-1984) ను పొందుపరిచారు. కేవలం సాహిత్యం మాత్రమే కాదు, పాట గురించిన విశ్లేషణ, పాటవెనుక సంగీతదర్శకుల, సాహిత్యస్రష్టల తపన, కొన్ని సందర్భాల్లో దర్శకులు పాటను చిత్రీకరించిన తీరు, గాయనీగాయకుల అంకితభావం, నిర్మాణసంస్థల వివరాలు, కొన్ని అద్భుతమైన ఛాయా చిత్రాలు వీటన్నిటి సమాహారం ‘పాడనా తెనుగుపాట'. పాటకై ప్రాణం పెట్టే రవిచంద్రన్ లాంటి వారేఈ సంకలనం చేయగలరు. వీరి కృషి తరతరాలకూ ఉపయోగపడుతుంది. పాటకు వీరు చేసిన విశ్లేషణ చదివాక, మళ్లీ ఆ దృష్టితో పాటను చూడాలి, వినాలి అన్న పిపాసను కలిగించి ధన్యులయ్యారు కంపల్లె రవిచంద్రన్.

- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

డా. కంపల్లె రవిచంద్రన్.... తెలుగు సినీ అభిమానులకు చాలా ఇష్టమైన పేరు, ఈయన రచనలు చదవడమంటే షడ్రషోపేతమైన విందు ఆరగించినట్లే. తనకంటూ ఓ పాఠక వర్గాన్ని సృష్టించుకున్న రచయిత ఈయన. 2015 సం||లో ఉత్తమ సినీ విమర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం, 2016 సం||లో 'నంది' అవార్డుల న్యాయనిర్ణేతలలో ఒకరిగా నంది పురస్కారం. 2016 సం||లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అత్యున్నత ‘తెలుగుభాషా దినోత్సవ పురస్కారం' అందుకున్న ఈ ప్రతిభాశాలి. కలం నుండి వెలువడ్డ తాజా పుస్తకం “పాడనా తెనుగు పాట'.

- పబ్లిషర్స్

గమనిక: " పాడనా తెనుగు పాట " ఈబుక్ సైజు 9.9mb
Preview download free pdf of this Telugu book is available at Padana Tenugu Pata