• Padamudu Rojulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పదమూడు రోజులు

    Padamudu Rojulu

    Publisher: Shaili Publications

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ మధ్యకాలంలో యూరప్ పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ టూర్‌కి సంబంధించిన వివరాలు ఇంటర్నెట్‌లో లభ్యం అవుతున్నప్పటికీ, తెలుగులో వివరంగా దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే యూరప్ యాత్రపై కొన్ని తెలుగు పుస్తకాలు ప్రచురించబడినప్పటికీ, ఈ నవల చాలా భిన్నంగా ఉంటుందని నమ్ముతున్నాను. సాధారణంగా మనం చదివే ట్రావెలాగ్‌లలో కేవలం పర్యాటక వివరాలు మాత్రమే ఉండడం వల్ల, ఒక రకమైన మొనోటని కారణంగా చదువరికి విసుగు కలిగే అవకాశముంది. అందుకే దీనిని కొంత భిన్నంగా తయారు చేసాను. కొన్ని కల్పిత పాత్రలు సృష్టించి, సహజమైన పాత్రలతో మిళితం చేసి భిన్నంగా రూపొందించాను. సహజంగా చిత్రకారుడిని కావడం వల్ల, కల్పిత పాత్రలు పోల్చుకొనే నిమిత్తం వాటిని బొమ్మల రూపంలో చూపించాను. వాటివల్ల ఏది సహజ పాత్ర, ఏది కల్పిత పాత్ర అనే కన్ఫ్యూజన్ ఉండదు. ఇదొక కొత్త ప్రయోగం. పర్యాటక వివరాలను తెలుసుకుంటూనే, పాఠకుడు కల్పిత నవలలో మునిగిపోతాడు.

పాత్రల ద్వారా వివరాలు తెలియజేస్తూ ఒక గొలుసుకట్టు నవలగా రూపొందించడం పాత పద్ధతే అయినా, ఈ మధ్య కాలంలో ఈ ప్రక్రియను అందరు మర్చిపోయారు కనుక ఇది కొత్తదనాన్ని సంతరించుకుంటుందని ఆశిస్తున్నాను. మధ్య మధ్యలో కొన్ని జోకులు, సందర్భానికి తగ్గట్టు కొన్ని వాస్తవిక సంఘటనలు జోడించడం జరిగింది. యూరప్ టూర్‌కి వెళ్ళే ముందు ఈ పుస్తకం చదివి, టూర్లో కూడా దీనిని అందుబాటులో ఉంచుకుంటే, ఆ టూర్‌కి పూర్తి న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నాను. థామస్ కుక్ ద్వారా మేము వెళ్ళిన 13 రోజుల యాత్ర ఆధారంగా ఇది వ్రాయబడింది.

- కొయిలాడ రామ్మోహన్ రావ్

Preview download free pdf of this Telugu book is available at Padamudu Rojulu