• Padamati Sandhya Ragam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 118.8
    132
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పడమటి సంధ్యారాగం

    Padamati Sandhya Ragam

    Publisher: Thulli Rajagopal

    Pages: 131
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా కొడుకు స్వశక్తి మీద వృద్ధిలోకి రావాలి తప్ప ఆస్తిలో్కానీ వ్యాపారంలోకానీ వాడికి ఏదీ ముట్టే అవకాశం లేదు. ఆడపిల్లలిద్దరికీ ఆస్తి పంపకం చేశాను. మా లాయరు దానికి సంబంధించిన పత్రాలన్నీ సిద్ధం చేశాడు. నా కొడుక్కి ఈ సంగతి ముందుగానే చెప్పి వాడిని ముందుంనుంచి దీనికి సిద్ధం చేశాను.

ఇక చివరగా మా అమ్మాయిల్ని పిలిచి ఆస్తి పంపకం గురించి చెప్పాను. ఇక్కడే నేను ఊహించనిది జరిగింది. నా నిర్ణయాన్ని నా కూతుళ్ళిద్దరూ వ్యతిరేకించారు.

నేను సంపాదించిన ఇచ్చిన ఆస్తి వారికి వద్దట. 'ఎందుకని?' అదే అడిగాను.

"సారీ డాడీ, మీరు సంపాదించింది మాకొద్దు. తమ్ముణ్ణి ఎలాగైతే స్వశక్తి మిద ఎదగమంటున్నారో అలాగే మేం కూడా మా సొంతకాళ్ళపై ఎదగాలనుకుంటున్నాం. వాడే కాదు, మేం కూడా మీ పెంపకంలోనే పెరిగాం. మీరు సంపాదించి ఇస్తే అనుభవించడం కాదు, మాకుగా మేమె సంపాదించుకుంటాం. మీకంటే గొప్ప స్థాయికి చేరుకుంటాం. ఆడపిల్లలుగా మీరిచ్చింది పుచ్చుకుని అత్తారిళ్ళకు వెళ్ళీపోయి కాపురాలు చేసుకోడం కాదు... ముందు మేం బిజినెస్‌లో ఎదుగుతాం... ఆ నమ్మకం మాకుంది. మేం చదివిన చదువు అందుకు మాకు ఉపయోగపడుతుంది" అని నా చిన్న కూతురు సుస్మిత వాళ్ళిద్దరి తరపునా చెప్పిన మాటలు విని నాకు నోట మాట రాలేదు. చేష్టలుడినట్లు వారి వంక అలాగే చూస్తూండిపోయాను.

నా పెద్ద కూతురు మాట్లాడుతూ "సారీ నాన్నా, మీ మనసు కష్టపెట్టాలని కాదు... కానీ తమ్ముడే కాదు, మేం కూడా మీ వారసులమే... వాడి లాగే మేమూ స్వశక్తితో ఎదుగుతాం, మీరే చూస్తూండండి" అంది.

Preview download free pdf of this Telugu book is available at Padamati Sandhya Ragam