• Padamati Needa
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పడమటి నీడ

    Padamati Needa

    Author:

    Publisher: Asif Publications

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హనీఫ్‌ మాత్రమే రాయగలిగిన కథలివి. ఇతరులు ఇప్పటి వరకు స్పృశించని అంశాల్ని ఇతివృత్తాలుగా ఎంచుకోవడం ఈ గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో జీవనవైరుధ్యాల చిత్రణ కథల ప్రత్యేకత. భద్రంగా జీవించే మధ్యతరగతి వర్గాలకు బొత్తిగా పరిచయం లేని వారి బతుకు తీరును ఈ కథలు తెలియజెప్పాయి. కథల్లోని పాత్రలకీ, సంఘటనలకీ ఇరవై సంవత్సరాల పైబడిన సామాజిక, ఆర్థిక నేపథ్యంం వుంది. మనుషులతో సంబంధం లేకుండా మార్పుల క్రమం కొనసాగుతుంది. మరి ఈ మార్పులు సామాజిక జీవితంపైన, రెక్కల కష్టమ్మీద బతికేవారిపైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఈ కథలు వివరిస్తాయి. అయితే ఈ తెలియజెప్పడం ఒక్కటే కథకుని ఉద్దేశం కాదు. తద్వారా పాఠకుల్లో ఆలోచనల్ని, సహానుభూతిని, తద్వారా ఒకింత కార్యశీలతని రచయిత ఆశిస్తున్నారు.
నగరాల్లో, పట్టణాల్లో గ్లోబలైజేషన్‌ ఫలాలు పొందిన, పొందుతున్న వర్గాలు గ్లోబలైజేషన్‌కు సానుకూలంగా మాట్లాడే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగింది. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి రావడం, తమ అనుభవాల్లో భాగం కావడం వంటివి గ్లోబలైజేషన్‌ ఫలితంగానే లభించినట్లు భ్రమపుతున్నారు. కానీ ఇదే గ్లోబలైజేషన్‌ కారణంగా ఛిద్రమవుతున్న జీవితాలు, మానవ సంబంధాలు, కాళ్ళకింద నేల కరిగిపోతున్న వైనాన్ని చెప్పేవారు అరుదు. ఈ పరిస్థితులలో తను చూసిన జీవితాన్ని తన అనుభవంలోకి వచ్చిన జీవన శకలాన్ని పరిశీలించి, కలత చెంది, కలవరపడి, తనలోపలి కల్లోల్లాన్ని కథలుగా మార్చారు హనీఫ్‌.

Preview download free pdf of this Telugu book is available at Padamati Needa