• Padakondava America Telugu Sahiti Sadassu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు (free)

    Padakondava America Telugu Sahiti Sadassu - free

    Pages: 135
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


• గత యాభైఏళ్ళకి పైగా అమెరికాలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్య ప్రక్రియలలో, ముఖ్యంగా అమెరికా తెలుగు కథ, కవితల అవిర్భావం, మారుతున్న పరిణామాలు, ప్రమాణాలు, ఆధునిక పోకడలు మొదలైన సాహిత్యపరమైన విషయాలు నెమరు వేసుకోవడం.
• సాహిత్య పరమైన విషయాలపై కూలంకష పరిజ్ఞానం, సాధికారత ఉన్న ప్రతిభావంతులు సహ సాహితీవేత్తలతో సభాముఖంగా ప్రసంగించే అవకాశాలు, స్వీయరచనా పఠనం వేదికలో రచయితలూ, కవులూ తమ రచనలను స్వయంగా వినిపించే అవకాశాలు కలిగించడం.
• సహరచయితలను, సాహితీవేత్తలనూ, తెలుగు భాషా, సాహిత్యాభిమానులనూ వ్యక్తిగతంగా, ఆత్మీయ సాహిత్య వాతావరణంలో కలుసుకొని, సాహిత్య పరిచయాలను పెంచుకొనడం.
• రెండు రోజుల పాటు కేవలం వినోదం, విజ్ఞానం వెదజల్లే తెలుగు భాషా, సాహిత్య పరిమళాలను తనివి తీరా ఆస్వాదించడం.
• సభానంతరం "సభా విశేషసంచిక" (Proceedings of the Conference) e-book అంతర్జాలంలో ఉచితంగా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ప్రచురించడం.
లాభాపేక్షలేని ఈ జాతీయస్థాయి 11వ అమెరికా సాహితీ సదస్సులో ఉత్తర అమెరికా అమెరికాలో అనేక నగరాల నుంచీ, భారత దేశం నుంచీ తెలుగు రచయితలు, పండితులు, విమర్శకులు, వక్తలు, భాషాభిమానులు, తెలుగు భాషా, సాహిత్యాల పురోగతిని ఆకాంక్షించే సుమారు 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ రెండు రోజుల సాహితీ సదస్సు విశేషాలను, ప్రసంగ వ్యాసాలను 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభా విశేషసంచికలో పొందుపరిచాం. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ జ్ఞాపికగా తెలుగు సాహిత్యాభిమానుల అదరణ పొందుతుంది అని ఆశిస్తున్నాం.

- వంగూరి చిట్టెన్ రాజు

గమనిక: "11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు" ఈబుక్ సైజు 9.2mb