-
-
పచ్చల లోయ.. పాతాళసుందరి
Pachchala Loya Patala Sundari
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 57Language: Telugu
మంత్రతంత్రాలతో చిత్రవిచిత్రాలతో టక్కుటమారా విద్యలతో ఒళ్ళు గగుర్పొడిచే పచ్చలలోయలోకి వెళ్లే ఆ సాహసి ఎవరు ?
పాతాళసుందరిని బంధించిన మాంత్రికుడు ఎవరు ?
రాకుమారుడు విజయవర్మకు తోడుగా వున్న మానవభాషలో మాట్లాడిన తుమ్మెద చేసిన సాహసం ఏమిటి?
ఆరావళి రాజ్యంలో ఏం జరిగింది?
పచ్చలలోయలోకి వెళ్లిన వారు ఎలా అదృశ్యమై ... ఏమై పోతున్నారు ?
పాతాళలోకం యువరాణి అవంతికను తన మంత్రశక్తితో బంధించిన మాంత్రికుడి కాపాలికుడి ప్రాణాలు ఎక్కడున్నాయి ?
సాహసాలు అబ్బురపరిచే విన్యాసాలు మంత్రతంత్రాలు..సరికొత్త ప్రపంచంలో విహరింపజేసే..
" పచ్చలోయ...పాతాళసుందరి " నవలలో అన్నీ అద్భుతాలే.
జానపద నవల వైభవం నా చిన్నప్పుడు చూసాను. జేబులో ఇమిడే సైజులో వున్న జానపద నవలలు.. అందులోని " అనగనగా ఒకరాజు " కథలు మర్చిపోలేని జానపదాల అపురూప జ్ఞాపకాలు.
జ్వాలాముఖి..మంత్రాలదీవి, మణిద్వీప రహస్యం... జానపద నవలలతో వరుసగా టాప్ టెన్‌లో వున్న రచయిత్రి శ్రీసుధామయి మూడవ జానపద నవల...హ్యాట్రిక్ నవల
పచ్చల లోయ.. పాతాళసుందరి
మేన్ రోబో పబ్లికేషన్స్ సగర్వ సమర్పణ
సబ్జెక్టులో కొత్తదనం వుంది.రచయిత్రి శైలి బావుంది. జ్వాలాముఖి మంత్రాలదీవి,మణిద్వీప రహస్యం నవలలు కూడా బావున్నాయి.జానపద నవలల శకం మళ్ళీ మొదలవుతున్నందుకు సంతోషంగా వుంది.
జానపద నవలలు అరుదుగా వస్తున్నాయి.ఆనాటి అద్భుత ప్రపంచాన్ని,పిల్లలేకాదు పెద్దలు సైతం చదివే జానపద నవలలు ఇప్పుడు కినిగెలో ప్రత్యక్షం కావడం ఆనందాన్ని కలిగిస్తుంది.
శ్రీసుధామయి జానపద నవలలోని శైలి ,వర్ణన మాయలు మంత్రాలు పచ్చల లోయవైపు తీసుకువెళ్తున్నాయి.
మళ్ళీ జానపద నవలా వైభవం తిరిగిరావాలి.
నవల పేరు చూడగానే చదవాలనిపించేలా వుంది.ముఖ్యంగా అప్పటి రాజులు మాయలు మంత్రాలు ఆ వాతావరణం కళ్లకు కట్టినట్టు వుంది.
శ్రీసుధామయి గారి జానపద నవలలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి.
చిన్నపాటి ప్యాకెట్ సైజు జానపద నవలలు గుర్తొచ్చాయి.నవల ఆసాంతం చదివించింది.ఒక్కసారి చిన్నప్పటికి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాం.