• PVNarasimharao
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పి.వి.నరసింహారావు

    PVNarasimharao

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పి.వి.గారి పేరు అందరం వింటూన్నదే. ఎందరిలాగానో వారూ పల్లెటూరులో జన్మించారు. వీధిబడిలోనే చదువుకొన్నారు. పిదప బస్తీ వెళ్ళారు. కళాశాలలో చదువు సాగించారు. బాగా పుస్తకాలు చదివారు. పలు భాషలు నేర్చుకున్నారు. ప్రముఖుల నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. లోకం తీరు గమనించారు. రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకున్నారు.

రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు చేరువయ్యారు. ప్రజల మనిషి అనిపించుకున్నారు. రాష్ట్ర శాసన సభకు పోటీ చేశారు. శాసన సభ్యునిగా ఎన్నికైనారు. పిదప మంత్రి అయినారు. పలు శాఖలు జయప్రదంగా నిర్వహించారు. అందరిచే శహభాష్‌ అనిపించుకున్నారు. కోరకుండానే ముఖ్యమంత్రి పదవి వరించింది. అచట తన సత్తా చూపారు.

వారి దృష్టి క్రమంగా దేశ రాజకీయాలవైపు మరలింది. పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనారు. పలు మంత్రిత్వశాఖలు, ముఖ్యంగా విదేశ మంత్రిత్వశాఖ నిర్వహించారు. తనదైన శైలిలో పాలనకు తోడ్పడ్డారు. వారి నిరంతర కృషి వారిపై దేశ ప్రధాన ప్రధాని కిరీటం ఉంచింది. అంత పెద్ద పదవిలో ఉన్నా ''దేశానికి రాజునైనా రాష్ట్రానికి అమ్మవొడి కన్నబిడ్డనే'' అన్న సౌమ్యశీలి పి.వి. దేశ ప్రధానిగా పి.వి. పలు సంస్కరణలు చేశారు. దేశ ప్రతిష్ఠపెంచారు. ప్రగతి సాధించారు. పి.వి. మంచి ఉపన్యాసకులు, కవి, రచయిత, 'లోపలి మనిషి' - పేరుతో తన అనుభవాలను, జ్ఞాపకాలను రాశారు.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at PVNarasimharao