• Ottesi Cheppana Inkokkasari
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒట్టేసి చెప్పనా ఇంకొక్కసారి!

    Ottesi Cheppana Inkokkasari

    Pages: 239
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


మధ్యాహ్నం హాల్లో బంతి చాపలు పరచి అందరికీ భోజనాలు వడ్డిస్తుండగా, సుజాత "వాసు, కీర్తి ఇద్దరికీ వేరుగా వడ్డించుదాం అమ్మా ! అందరితో ఎందుకు? " అంది వర్ధనమ్మతో.
" ఏమవుతుందే? మొన్నటి వరకూ వాదులాడుకుంటూ ఇద్దరూ ఒకరి కంచంలోది ఒకరు లాక్కుని తిన్న వారు కదూ! ఇక్కడ మాత్రం పరాయివారెవరున్నారు? రమ్మని చెప్పు! అందరూ సరదాగా మాట్లాడుకుంటూ తింటారు. అందరూ కూర్చోండి! రామయ్యా! జానకీ! మీరిద్దరూ వడ్డించండి!" వర్ధనమ్మ పురమాయించడంతో,
" వస్తున్నా ! అమ్మగారూ! " అంటూ ఇద్దరూ పరుగున వచ్చారు.
కీర్తి వస్తుంటే లాస్య, కావ్య వదిన ప్రక్కన నేనంటే నేనని వాదులాడుకుంటూంటే, " మీరిద్దరూ చెరో ప్రక్కన కూర్చుంటే, వాసు ఎక్కడ కూర్చోవాలి? ఓ వైపు వాసు అన్నయ్యను కూర్చోనివ్వండి పిల్లలూ!" అంది వసంత పిల్లలను కోప్పడుతూ!
కీర్తి వచ్చి కూర్చోగానే, వర్ధనమ్మ " వాసు ఎక్కడే?" అడిగింది.
" దానికేం తెలుసు? అది ఇప్పుడే నిద్ర నుంచి లేచి వస్తుంటే! "
"పూర్వకాలంలో భార్యలు భర్తలు తిన్నాక, ఆ విస్తరాకులోనే తినేవారట! " అన్నాడు భానుమూర్తి.
"ఆ రోజులలో విస్తరాకులకు అంత డిమాండు వుండేదా పెదనాన్నా? "అమాయకంగా అడిగినట్లు అడిగాడు భానుమూర్తి తమ్ముడు కొడుకు మధు.
అందరూ గొల్లున నవ్వారు.
" బాగా అడిగావురా! " అంది వసంత.
వాసును పిలిచేందుకు గదిలోనికి వెళ్లిన రామయ్య " వాసుబాబు గదిలో లేరమ్మా !" అంటూ వచ్చాడు.
" అవునా? చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడు? ఉదయం కూడా పెళ్లిలో టిఫిను కూడా సరిగా చేసినట్లు లేదు. కీర్తీ ! నీకేమైనా చెప్పి వెళ్లాడటే? " అడిగింది వర్ధనమ్మ.
ఏదో ఆలోచిస్తూ అన్నంలో గీతలు గీస్తున్న కీర్తి
సమాధానం ఇవ్వలేదు.
"కీర్తీ! నిన్నే అడుగుతున్నది? వాసు ఎక్కడకు వెళ్లాడు?" కృష్ణమూర్తి కొద్దిగా కోపంగా అడిగాడు.
" ఏంటి?" అప్పటివరకు మాట్లాడుకున్నవేవీ తన చెవిలో పడినట్లుగా లేవని అందరికీ అర్ధమైంది.
ఈసారి సుజాతకు చిర్రెత్తుకొచ్చినట్లయింది. "వాసు ఎక్కడకు వెళ్లాడంటూంటే వినిపించలేదూ!"
" నాకేం తెలుసమ్మా? " పైకి కాస్త విసుగుగా అందే కానీ, గుండె వేగం హెచ్చింది.
" ఏం తెలుసంటావేమిటే? నీకు కూడా చెప్పలేదూ? మరి ఎక్కడకు వెళ్లినట్లు? " సుజాత కంగారుగా అంది.
కృష్ణమూర్తి "పొలం వెళ్లాడేమో! ఫోను చేయండి! " అన్నాడు.
మధు ఫోను చేశాడు. వాసు ఫోను తీయగానే
" వాసన్నా! ఎక్కడున్నావు? మేమందరం భోజనం చేయకుండా ఎదురుచూస్తున్నాము!"
వాసు చెప్పింది విని ఫోను కట్ చేసి, "వచ్చేసరికి లేటు అవుతుందట! మనల్ని భోజనం చేసేయమన్నాడు."
" ఎక్కడున్నాడట? " అన్నారు శ్రీనివాసరావు మనవడి మీద కోపం అప్పటికి కాస్త తగ్గు ముఖం పట్టడంతో!
"ఏమో! చెప్పలేదు! ఆ మాట చెప్పి ఫోను కట్ చేశాడు."

గమనిక: " ఒట్టేసి చెప్పనా ఇంకొక్కసారి! " ఈబుక్ సైజు 5.5mb
Preview download free pdf of this Telugu book is available at Ottesi Cheppana Inkokkasari