-
-
ఆపరేషన్ డబుల్ క్రాస్
Operation Double Cross
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Language: Telugu
భారత దేశంలోని వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోడానికి ఆటమిక్ డిపార్ట్మెంట్లో వున్న ఒక సైంటిస్ట్ అణుశక్తితో పనిచేసే కంప్యూటర్ వంటి సైక్లోన్ రిఫ్లక్టర్ని రూపొందిస్తాడు. ఆన్ చేయగానే ఇందులోనుంచి శక్తివంతమైన అయస్కాంతం తరంగాలు సముద్రం మీదికి వ్యాపిస్తాయి. వాటి ప్రభావంవల్ల సకాలంలో వర్షాలను పొంది సుభిక్షం అవుతుంది మనదేశం. అయితే ప్రయోగాలలో ఏదో తప్పు జరిగి ఈ అపూర్వ యంత్రంలో మార్పు వచ్చింది. సాధారణమైన వాయుగుండాలను సృష్టించటానికి బదులు - ప్రయోగించిన మరుక్షణం బ్రహ్మాండమైన ఫెను తుఫానులను లేవదీస్తుంది. యంత్రంలోని లోపాలను సరిచేయక ముందే అతను హార్ట్ ఎటాక్‌తో మరణించటం జరిగింది. ఆ యంత్రాన్ని ప్రభుత్వం స్వాధీనపరచుకుని, దాన్ని భద్రపరచవలసిందిగా స్పెషల్ బ్రాంచికి ఆదేశాలు యిచ్చింది. కాని స్పెషల్ బ్రాంచి హెడ్‌క్వార్టర్స్‌లో వున్న ఆ యంత్రాన్ని కిల్లర్ గాంగ్ అపహరించింది. సైక్లోన్ రిఫ్లక్టర్ని దొంగిలించిన వాళ్లు దాన్ని సద్వినియోగపరిస్తే పరవాలేదు. కక్ష కట్టి దాన్ని భారతదేశం మీద ప్రయోగిస్తే అత్యంత ప్రమాదం. వారి జాడలు తెలుసుకుని, మన యంత్రాన్ని తిరిగి చేజిక్కించుకోవటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి.
దేశాన్ని విపరీత వాతావరణ మార్పుల నుంచి కాపాడడానికి షాడో రంగంలోకి దిగుతాడు. అయితే, సి.ఐ.బి కి పోటీదారులైన స్పెషల్ బ్రాంచ్ ఏజంట్లు అడుగడుగునా షాడో ప్రయత్నాలకి ఎలా అడ్డుతగిలారో, వారి నుంచి తప్పించుకుంటూ,షాడో దేశద్రోహుల ఆట ఎలా కట్టించాడో తెలుసుకోవాలంటే ఈ రోమాంచక నవల చదివితీరాలి.
ఈ ప్రయత్నంలో షాడోకి శ్రీకర్,గంగారాం వంటి మిత్రులతో పాటు ఒకప్పుడు షాడో నుంచి ఉపకారం పొందిన బందిపోటు రాంచంద్, స్మగ్లర్ రామ్‌దయాళ్ వంటి వారు ఎలాంటి సహాయ సహకారాలందించారు? ఆద్యంతం ఆసక్తికరంగా సాగే నవల ఇది.
This novel is now available in Tenglish script with Kinige. For details, click the link.