-
-
ఆపరేషన్ బెంగాల్ టైగర్
Operation Bengal Tiger
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 140Language: Telugu
Description
అపూర్వమైన అధికారాలు కలిగివున్న తనవైపు గాని, షాడోకి బాస్ అయిన కులకర్ణిగారి వైపుగాని అతను చూడకపోవటం, తన సలహా సంప్రదింపులకోసం వెయిట్ చేయకపోవటం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి హోమ్ మినిస్టర్ గారికి.
ఆయన మనస్సు లోని ఆలోచనల్ని గ్రహించి చిన్నగా నవ్వారు కులకర్ణి.
“అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ షాడో మాటకు తప్ప మరొకరు అభిప్రాయానికి విలువ ఇవ్వటం అతనికి తెలియదు... షాడో కను సైగ చేస్తే చాలు మన మీదికి కూడా తన సెక్రటరీలను ఉసికొల్పగల జగమొండి..... అతన్ని గురించి ఆలోచించకండి... మన కంట్రోల్లో లేని మహా పర్వతం అది....” లోగొంతుకతో అన్నారాయన హోమ్ మినిస్టర్ గారికి మాత్రమే వినిపించేటట్లు.
ఆయన మాటల్ని గాని, హోమ్ మినిస్టర్ గారి ఆలోచనల్ని గాని పట్టించుకోలేదు వీరి ప్రక్కనే కూర్చుని వున్న షాడో.
Preview download free pdf of this Telugu book is available at Operation Bengal Tiger
Offers available on this Book
can i read shadow books online in free of cost