-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఊహాచిత్రం (free)
Ooha Chitram - free
Author: Aripirala Satyaprasad
Publisher: Gna Prachuranalu
Pages: 136Language: Telugu
ఒక భావుకుని సుందర స్వప్నాల్నీ, ఒక మంచి మనిషి ఆశయ వాంఛల్నీ, వైవిధ్యభరితంగా వెలువరించిన కథానికలు ఇవి. చదివించే గుణంతో పాటు కథ చెప్పే విధానంలో తనదైన నైపుణ్యాన్ని రుజువు చేసుకున్నాడు సత్యప్రసాద్. సామాజిక కేంద్రం నుండి సాగిన మానవ సంబంధాల వృత్తాలు ఈ కథాంశాలు. రచయిత అధ్యయన శీలానికీ, జీవితానుభవానికీ మాత్రమే కాక, ఒక కథా శిల్పి ప్రయోగశీలతకి కూడా ఇవి నిదర్శనాలు!
- విహారి
యీ కథలు మనలని యాజిటేట్ చెయ్యవ్. యీ కథలు మనల్ని నిద్రపుచ్చవ్. యీ కథలు మనల్ని నిర్లిప్తంగా వుంచవ్. మనం మన చుట్టూ వున్న మనుష్యులని కంప్లెయింట్లతో కాక ఆత్మీయంగా అర్థం చేసుకొనే వైపు యీ కథలు నడిపిస్తాయి. అక్షరాలని యే శృతిలో యే రాగంలో అమరిస్తే తను అనుకున్న కథ పల్లవిస్తుందో తెలిసిన కథావిద్వాంసుడు అరిపిరాల సత్యప్రసాద్. మనకి వూహ తెలిసిననాటి నుంచి మనం తెలవారుఝామున వినే చిరపరిచిత స్వరాన్ని యీ కథలు తిరిగితిరిగి మనలోకి ప్రవహింపచేస్తాయి.
- కుప్పిలి పద్మ
అరిపిరాల సత్యప్రసాద్ ఒక అన్వేషి. ఆయన కథల్లో ఏదో వెతుకులాట వుంటుంది. సత్యం కోసమో, జీవితానికి అర్థం కోసమో, లేక తనకే తెలియని ఒక జ్ఞాపకం కోసమో, వెతుకుతూ వుంటాడు. ఆయన కథలు చదివిన తరువాత మనం కాస్త ఆలోచనలో పడతాం. జీవిత ప్రవాహంలో దారీతెన్నూ తెలియకుండా కొట్టుకుపోకుండా ఏదో గడ్డిపోచ కోసం గాలిస్తాం. వాక్యాల సంక్లిష్టత, పదాల గాంభీర్యం లేకుండా సరళంగా సూటిగా చెప్పడం ఆయన శైలి. ఆధునిక జీవితంలోని డొల్లతనాన్ని, కపటత్వాన్ని ఆవిష్కరిస్తూనే మనిషి మనిషిగా బతకడంలోని ఆనందాన్ని కూడా వివరిస్తాయి ఈ కథలు.
- జి. ఆర్. మహర్షి
’ఊహాచిత్ర’కారుడు అరిపిరాల సత్యప్రసాద్ 35 సంవత్సరాల ఆధునిక విద్యాధిక యువకుడు. ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యమిచ్చే కార్పొరేట్ వ్యవస్థలో భాగస్థుడు. ఐనా అతడికి తెలుగు భాషమీద పట్టుంది. తెలుగుతనం పట్ల అవగాహన ఉంది. తెలుగు సాహిత్యపు నేపథ్యముంది. తెలుగుకు భాషగా తెలుగునాటనే ఆదరణ లేదనీ, తెలుగు కథనరంగంపట్ల యువతరానికి ఆసక్తి లేదనీ ఇప్పుడు చాలామంది నమ్ముతున్నారు. తెలుగు భాష త్వరలో అంతరించనున్నదన్న అనుమానం అంతర్జాతీయంగా ప్రచారమౌతోంది. అలాంటి నమ్మకాల్నీ, అనుమానాల్నీ - నిర్ద్వంద్వంగా తొలగిస్తుంది – ’ఊహాచిత్రం’ కథా సంపుటి.
- "వసుంధర"
