-
-
ఒంటరితనము... ఏకాంతము
Ontaritanamu Ekantamu
Author: Neelamraju Lakshmi Prasad
Publisher: Neelamraju Lakshmi Prasad
Pages: 120Language: Telugu
శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్గారికి నమస్కారములు
మీరు ప్రచురించిన పుస్తకాలన్నింటిలోని అనుభవాలను, విశేష సంఘటనలను, వాటిలో గర్భితమైన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, ఏ పఠితకైనా కొన్ని సోపానాలను ఎక్కిన అనుభూతి కలుగుతుంది. ఇది పొగడ్తకోసం అనడం కాదని మనవి.
ఇంత సమాచారాన్ని, ఇన్ని విశేషాలను ఎక్కడ ఎలా సేకరించారో లక్ష్మీప్రసాద్గారు, అని పఠితకు అనిపించడం సహజం. కథా సరిత్సాగరం వలెనే, మీ వ్యాసాలన్నీ – పుస్తకాలుగా ప్రచురితమైనవి – ఓ ఆధ్యాత్మిక వ్యాససాగరమే అనిపిస్తుంది. ‘ఆధ్యాత్మిక’ అనడం కంటే ‘జ్ఞానవ్యాససాగరం’ అనడం నముచితమనిపిస్తుంది.
హాస్య రచనలు చేయడం మీకు చిన్నవయసునుంచే అనుభవం. ఆధ్యాత్మిక వ్యాసాలను వ్రాసినప్పుడు సైతం మీ హాస్యరచనా శైలి, నైపుణ్యం, హాస్య సౌరభాన్ని కలిగించి, మీ రచనలను పఠనీయం, రసరమణీయం కావించాయి.
ఇలా వ్రాస్తున్న వారు నాకు మరెవరూ సమకాలీనులలో కనిపించడం లేదు.
అభినందనలతో
పొత్తూరి వెంకటేశ్వరరావు

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162
- ₹90
- ₹162
- ₹120
- ₹67.2
- ₹86.4
- ₹120