-
-
ఓమిక్రాన్
Omicron
Author: Dr. Koti Kapuganti
Publisher: Self Published on Kinige
Pages: 142Language: Telugu
అది జపాన్ లోని ఉత్తర క్యూషోలో ఉన్న 'ఒమేగా హట్ స్ప్రింగ్ రిసోర్ట్' ప్రస్తుతం అందులో... 14వ అంతస్తులో... ఉన్న పెంట్ హౌస్ లో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు.
అతను సరిగ్గా అప్పటికీ పది నిమిషాలు ముందే.... తన సొంత హెలికాప్టర్లో.... అక్కడ ఆ హొటల్ టెర్రస్ మీద ఉన్న హేలీ పేడ్ మీద దిగాడు.
అతనే ప్రపంచ ప్రఖ్యాత 'అకాకో మైనింగ్ కంపెనీ' ఎండి మిస్టర్ 'యినికే'
యినికే గత కొన్ని నెలల ముందే జపాన్ దేశం నుండి 'ఆషియె కాపర్ మైన్' లీజ్ కు తీసుకున్నాడు.
"నిజానికి ఆషియో కాపర్ మైన్ 16 వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. దాని నుండి దాదాపు పదిహేను వందల టన్నుల కాపర్ ఉత్పత్తి అయ్యేది.
కానీ.... కాలుష్యం కారణంగా దానిని 18 వ శతాబ్దం లో మూసివేశారు. మళ్ళీ జపాన్ పారిశ్రామికీకరణ జరిగాక దానిని కొన్ని భద్రతా నియమాలతో ప్రైవేట్ కంపెనీ కి ఇవ్వాలని జపాన్ గవర్నమెంటు నిర్ణయించుకుంది.
అలా మొత్తానికి అది చాలా కాలానికి ఇప్పుడు 'అకాకో మైనింగ్ కంపెనీ' చేతుల్లోకి వచ్చింది
కానీ... ఏమి లాభం ఆ 'గని' తెరిచిన వెంటనే దాదాపు 40 మంది కార్మికులు రక్తం కక్కుతూ.... చనిపోయారు.
చాలాకాలం ఈ కాపర్ గని మూసి ఉండడం వలన దీని నిండా.... ఎలుకలు.....పందికొక్కులు లాంటి జంతువులు వందలు,వేల సంఖ్య లో పెరిగిపోయాయి. ప్రస్తుతం అదే ఈ కొత్త వైరస్ పుట్టుకకు ప్రధాన కారణం
"సార్ మిమ్మల్ని కలవడానికి" టోక్యో మాలిక్యులర్ వైరాలజీ డిపార్ట్మెంట్ నుండి ప్రొఫెసర్ డాక్టర్ యూకీ వచ్చారు."యినికే కి తన పి.ఏ వచ్చి చెప్పాడు.
"అతన్ని లోపలికి రమ్మను"గంభీరంగా చెప్పాడు యినికే
"నమస్తే సార్ నా పేరు యూకీ" ఏదో చెప్పబోతూ... ఉండగా "మా పి.ఏ మీ గురించి అంతా చెప్పాడు ముందు మీరు వచ్చిన పని చెప్పండి." సూటిగా అడిగాడు యినికే
"ఏమీ లేదు సార్ మీరు ఆషియో కాపర్ మైన్స్ లీజుకు తీసుకున్నారని విన్నాను"
"ఆ... అయితే...?"
"మీకు తెలుసు కదా సార్ మా లేబరేటరీ అంటేనే పరిశోధన ముందుగా కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియ చెప్పాలనే ఓ ఆరాటం ఉంటుంది."
"సరే అదంతా నాకెందుకు చెబుతున్నారు...?"యినికే ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలలో మైన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అందుకే అతనికి ప్రతి నిమిషం చాలా విలువైనది.
"సరే విషయానికి వచ్చేస్తాను సార్ మాకు మీ గనిలో ఉన్న అవశేషాలు కావాలి"
