• Oka spashta kosam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఒక స్పష్టతకోసం... (free)

    Oka spashta kosam - free

    Author:

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక స్పష్టతకోసం రాసిన కవితాసంపుటిలోని కవితలలో సంశయాలు కూడా స్పష్టంగానే ఉన్నాయి. ఆధ్యాత్మికతత్త్వం ఒక శాస్త్రీయజ్ఞానమైతే దాని వినియోగస్థానం భౌతికజీవితమే. శరీరాన్ని వదిలిన తర్వాత ఆ జ్ఞానాన్ని వినియోగించుకొనే అవకాశం లేదు కాబట్టి, పార్వతికి గుర్తున్నట్లు గతజన్మ జ్ఞానాలు అందరికీ వర్తమానజన్మలో గుర్తుకురావు కాబట్టి ఆ జ్ఞానాన్ని వర్తమాన జీవితంలోనే వినియోగించటం అనివార్యం.

వచనకవితకు అవసరమైన ఒడుపూ, లయా అరుణకవితలో వేళ్ళూనుకున్నాయి.

"క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయోః, కర్మేతి హస్తయోః గతిరితి పాదయోః .. ఇది తైత్తిరీయోపనిషద్వచనం. ఋషీవలులు కవితలో ఆ వాక్యాల సమన్వయం కనిపిస్తుంది. బహు స్యాం ప్రజాయేయ ...కవితలోని భావన అనేకోపనిషద్ గ్రంథాలు సూత్రప్రాయంగా ప్రస్తావించి ప్రదర్శించినదే.

రచయిత్రిలోని ప్రాథమికభావన తాత్త్వికమైనా సామాజిక దృష్టికి దూరం కాలేదన్న వాస్తవాన్ని విరుగుతున్న బొమ్మలలో ప్రదర్శిస్తోంది రచయిత్రి,

చదివి సంపాదించిన అవగాహనను సామాజికజీవితంతో సమన్వయం చేసి భావించే ప్రయత్నం ఈ కవితల్లో కనిపిస్తుంది.

ఇది తొలి ప్రయత్నం. తన కవితలలో స్పష్టతా సమగ్రతలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. భవిష్యత్తులో మరింత పదునుదేరిన కవితలతో పాఠకుల నలరించగలదని ఆశిస్తూ శుభాకాంక్షలతో....

- సూరం శ్రీనివాసులు