-
-
ఒక వేణువు పలికింది
Oka Venuvu Palikindi
Author: Aduri Satyavati Devi
Pages: 180Language: Telugu
ఒక వేణువు పలికింది
ఆదూరి సత్యవతీదేవి లలితగీతాలు
ఏకతారను చేతపట్టి, దేశద్రిమ్మరిగా తత్త్వాలు పాడుకుంటూ సంచరించిన అజ్ఞాత గోసాయి గళమూ, సృష్టికర్త సృజనాత్మకతను అన్వేషిస్తూ తన మార్మిక కవితాపంక్తుల్లో లోకాన్ని ఆశ్చర్యపరిచే రవీంద్ర సంగీతమూ, భక్తి రసగాంధర్వుడు చైతన్య ప్రభు పదఘట్టాలూ, గాంధీమహాత్ముడిని మైమరిపించిన గుజరాతీ వైష్ణవ సాంప్రదాయ కీర్తనల సలలిత సుధారసమూ, త్యాగరాజస్వామి ఆత్మఘోషా నాదరవళి లను ఈ గీతాలు వైవిధ్యంతో పలికించాయి.
- మునిపల్లెరాజు
భక్తాగ్రేసరులు ఏయే రూపాలలో, భగవంతుని కొలిచి సేవించి రచనలు చేసినా, కృష్ణావతారంలో మాత్రం మనస్సుని మత్తెక్కించే లక్షణమే ఉండి తీరింది. ముఖ్యంగా బాలకృష్ణుని లీలలు. సత్యవతీదేవి కృష్ణపరంగా రచించిన గీతాలు సుమారు 60 దాకా ఉంటాయి. ఏనాటిదీ మురళి! వెదురు తపములు పండి వేణువుగా మారినదట! ఆ మురళి బాలకృష్ణుని పెదవి తాకంగానే సంగీత లోకాలు గంగా తరంగాలతో పరవళ్ళు త్రొక్కుతున్నాయట. ఏమి భావన! హృదయవేదన, హృదయరాధన, భావావేశము, భక్తి పారవశ్యము - ఇవన్నీ ఒకదానితో ఒకటి పోటీపడి పండిన హృదయంలో, పరవళ్ళు త్రొక్కుతున్న నాదసముద్రంలో జలకాలాడి పొంగివచ్చిన గీతికా తరంగాలు, సత్యవతీదేవి కృష్ణగేయాలు.
- పాలగుమ్మి విశ్వనాథం
