-
-
ఒక నజియా కోసం
Oka Nazia Kosam
Author: Nagesh Beereddy
Publisher: Vasireddy Publications
Pages: 208Language: Telugu
నజియా...
ఈ పేరు ఇనంగనే నా దిల్ ఖుష్ అయితది. ఎంత అందమైన పేరు కదా. అలా పిలవడం తనకు పెద్దగా నచ్చదు. తన అసలు పేరు నాజియా అట. నాకేమో దీర్ఘం తీయనీకి రాకపోయె. మొదటిసారి పలకరించినప్పుడే చెప్పింది. ‘నజియా నహీ హై మేరా నామ్... నాజియా హై’ అని. నేనేమో ఎప్పుడూ గిట్లనే ‘నజియా.. నజియా’ పిలుస్తుంటిని.
నాజ్ అంటే గర్వకారణమట. నజ్ అంటే అర్థం తెల్వదు గానీ నజియా దొరకడం నాకు, నా జీవితానికి గర్వకారణమే.
నిజంగ ఎంత ముద్దుగుంటదో ఎర్కేనా!?
అసలు చంద్రకిషోర్ కంటే ముందుగాల రాయాల్సింది నజియా గురించే.
ఎందుకంటే చంద్రం కంటే, అందరికంటే, అన్నింటికంటే నాకు ఎక్కువ తనే కాబట్టి. తనే జిందగీ కాబట్టి. నేను బతుకుతున్నదే ఆమె కోసం. అందుకనే ఆమె గురించే రాయాలి.
నా పేరేమో రామస్వామి. తనేమో నజియా. సాహెబుల పిల్ల. కానీ మా ఇద్దరికీ ఎట్ల కుదిరిందో ఏమో. ఒక్కకాడ్కి చేరినం. ఇంగ తనే నా దునియా అయిపాయె. అందుకే రాయాలె. తన గురించి రాయాలె. తనని మొదటిసారి కలిసిన ముచ్చట జెప్పాలె. దాని కంటే ముందల.. ముందు నేను పట్నం ఎందుకొచ్చిన్నో చెప్పాలె. ఎట్టొచ్చిన్నో రాయాలె. మా ఊరి గురించి రాసుకోవాలె.
